కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి ప్రజల్లో ఎంతటి పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ ప్రేక్షకులు, సినీ తారలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన మరణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రెజంటర్, ప్రొడ్యూసర్‌గా సినిమా ఫీల్డ్‌లో తన మార్క్ చూపించారు. అంతే కాదు పు26 అనాథాశ్రమాలు.. 45 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు.. 1800 మంది పిల్లల చదువు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఏడాది భారీ ఎత్తున ఈ సేవా కార్యక్రమాలకు గాను ఖర్చు చేస్తున్నారు.
పునీత్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో ఆయన హీరో అనిపించుకున్నారు. అందుకే ఆయనపై అభిమానులు అంత ప్రేమ పెంచుకున్నారు. పునీత్ సమాధి దగ్గరికి వేల మంది వచ్చి దర్శించుకుంటున్నారు. తాజాగా పునీత్ అభిమానులు ఇద్దరు తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ ప్రేమ జంట పునీత్ సమాధి దగ్గర ఏకంగా పెళ్లి చేసుకున్నారు. గురు ప్రసాద్, గంగ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లకు పునీత్ అంటే పంచ ప్రాణాలు. తమ పెళ్లి జరిగిన తర్వాత పునీత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నారు.
ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మన మధ్యలో లేరు.. ఈ విషయాన్ని ఆ జంట ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన సమాధి ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణించుకున్నారు. కానీ, పెళ్లి చేసుకోవడానికి పోలీసులు అనుమతించలేదు. తాము బళ్లారి నుంచి వచ్చామని.. పునీత్ సమాధి ముందు పెళ్లి చేసుకోవడం తమకు ఆశీర్వాదం లాంటిదని వాళ్ళు చెప్పారు. అయినా కూడా పోలీసులు నిరాకరించడంతో మీడియా ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు. దీంతో బాధతో అక్కడి నుంచి వెలుతూ.. మీడియాతో మాట్లాడారు. దీనిపై రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు స్పందించారు. పునీద్ సమాధి ముందు ప్రేమ జంటలు పెళ్లి చేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. పునీత్ ప్రజల ఆస్తి అని అన్నారు. దాంతో గంగా, గురు ప్రసాద్ అక్కడే పెళ్లి చేసుకున్నారు.