కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ ఈ లోకాన్ని విడిచిపోయి నెల రోజులు పైనే గడిచిపోయాయి.అయినా ఆయన చనిపోయాడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగుళూరులోని కంఠీరవ స్డూడియోలో పునీత్ సమాధి ఉంది.పునీత్ వివాహాం అశ్వనీనితో జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయలు.అయితే పునీత్ రాజ్కుమార్కు వివాహం జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సమయంలో పునీత్ లేకపోడవం వారి కుటుంబ సభ్యులను బాధిస్తుంది.
1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినినీ పునీత్ ప్రేమించి పెళ్లాడారు. ఎన్నో ఆశలతో ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా జీవించాలనుకున్నారు. మంచి స్టార్ హోదా.. ఆర్థికంగా లోటులేదు. అన్ని విధాలుగా బాగున్నా ఈ చూడ చక్కనైనా జంట మీద దేవుడికి అసూయకలినట్లుంది. అందుకే పెళ్లైన 21 ఏళ్లకే వారిద్దిరి విడదీశాడు. పునీత్ అర్ధాంగి అశ్విని, ఆమె పిల్లలు ఒంటరైయ్యారు. విధి ఆడిన ఈ నాటకంలో 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్ మన మధ్య లేకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
పునీత్ తన చేసే సమాజ సేవను బయట ప్రపంచానికి తెలియకుండా చేశాడు. ఆయన మరణం తట్టుకోలేక కొందరు అభిమానుల గుండె ఆగితే…మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారంటే పునీత్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవచ్చు.ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ చూపించే పునీత్..అక్టోబర్ 29 న ఉదయం జిమ్లో కసరత్తులు చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు.అప్పు కుటుంబాన్ని పరామర్శించిన అల్లు శిరీష్పునీత్ అకాల మరణం శాండల్వుడ్కు తీరని లోటు అని తెలుగు నటుడు అల్లు శిరీష్ అన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పునీత్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది, బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా అప్పు ను కలిసేవాడినని అన్నారు.