కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం.. ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో సినీ అభిమానులను కలచి వేసింది. ఒక హీరో, డాన్సర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా పునీత్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ సినిమాలో తెరపై అప్పునీ చూసి అభిమానులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అప్పు అభిమానులందరకీ ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అదేంటంటే.. అప్పు మరోసారి వెండితెరపై కనిపించనున్నాడు. అవును మీరు చదివింది నిజమే. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘ఓ మై కడవలే’ సినిమాని ‘లక్కీ మ్యాన్’ గా రీమేక్ చేశారు. అందులో హీరోగా డార్లింగ్ కృష్ణ, హీరోయిన్ గా రోషనీ ప్రకాశ్ నటిస్తుండగా.. పునీత్ రాజ్ కుమార్ దేవుడి పాత్రలో నటించాడంట. ఈ సినిమాని డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెరకెక్కించాడు.
James World Television Premiere July 17th at 5:30PM On StarSuvarna
James (Hindi) World Television Premiere July 24th at 8PM On SonyMAX
Lucky Man movie in August pic.twitter.com/uF7K4Jj8SD
— Pooja R Raikar (@PoojaRRaikar1) July 7, 2022
లక్కీ మ్యాన్ సినిమా ఆగస్టులో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జేమ్స్ సినిమాలో పునీత్ పాత్రకు ఆయన అన్న శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ, లక్కీమ్యాన్ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ పాత్రకు డబ్బింగ్ రియల్ వాయిస్ లోనే ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ రియల్ వాయిస్ తప్పకుండా హైలెట్ గా నిలవనుంది.
#LuckyMan to release in August announce makers. #PuneethRajkumar acted in a special guest role in the movie. This is the last feature film appearance of #Appu 😭😭😭 @darlingkrishnaa plays the lead in film directed by Nagendra Prasad (Prabhudeva’s brother). pic.twitter.com/hyt6WnKngV
— S Shyam Prasad (@ShyamSPrasad) July 13, 2022
అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభుదేవాతో కలిసి అప్పు ఓ సాంగ్ కు డాన్స్ చేశారంట. ఆ సాంగ్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు. లక్కీమ్యాన్ సినిమాలో పునీత్ పాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోసారి అప్పుని తెరపై చూసే అవకాశం కలిగిందంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. లక్కీమ్యాన్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The 2secs which made my day❤️
Charged me up all of a sudden⚡#Luckyman pic.twitter.com/9yZ1Ivr1m3— Undisputed👑 (@PRKcultARK) July 6, 2022