కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సాగరంలోకి నెట్టేసింది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కంఠీరవ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన హీరోని చివరిచూపు చూసుకునేందుకు భారీగా తరలివచ్చారు. కన్నడ ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా యావత్ సినీ తారలు, సెలబ్రిటీలు, అభిమానులు బెంగళూరుకు పయనమయ్యారు.
శుక్రవారం రాత్రి నుంచే అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగింది. పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు శనివారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను వాయిదా వేశారు. కుటుంబ సభ్యుల సాయంత్రానికి వచ్చే పరిస్థితి లేకపోవడం వల్లే అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
#PuneethRajkumar pic.twitter.com/4A7qVz0vDX
— NDTV (@ndtv) October 30, 2021