తెలుగు ఇండస్ట్రీలో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంలో అద్భుతమైన పాటలు అందించి ఒక్కసారే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మారారు ఏఆర్ రెహమాన్. ఆయన వెండితెరపైనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ షో లు ఇస్తూ.. బాగా పాపులర్ అయ్యారు.
సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా ఉంటూ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో స్వయంగా సంగీతం అందించి అద్భుతమైన పాటలు అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. రెహమాన్ కెరీర్ లో రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతగొప్ప కళాకారుడికి పూణేలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
తన మ్యూజిక్ తో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటారు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఆయన ఎన్నో అద్బుతమైన పాటలకు బాణీలు అందించారు. స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా ఏఆర్ రెహమాన్ వైపే మొగ్గు చూపిస్తుంటారు. ఏఆర్ రెహమాన్ వెండితెరపైనే కాదు.. పలు మ్యూజిక్ షోలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. తాజాగా పూణేలో జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో లో ఏఆర్ రెహమాన్ కి చేదు అనుభవం ఎదురైంది. రెహమాన్ మ్యూజిక్ షోకి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఆయన తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి స్టేజ్ పైకి ఎక్కేసారు.. ఏఆర్ రెహమాన్ పాడుతుండగానే అడ్డుకున్నారు. మ్యూజిక్ షోని వెంటనే ఆపివేయాలని.. బ్యాండ్ సభ్యుల్ని కోరారు. అప్పటికే సమయం దాటిపోయిందని.. మ్యూజిక్ కన్సెర్ట్ ను ముగించాలని సూచించారు.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో అంటే జనాలు పడిచస్తారు.. ఈ క్రమంలోనే ఆయన మ్యూజిక్ షోకి సంగీత అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అప్పటి వరకు రెహమాన్ మ్యూజికల్ కన్సెర్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెహమాన్ తన పాటలతో యువతను ఉర్రూతలూగించారు. ఈ షో ముగిసిన తర్వాత రెహమాన్ తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకుంటూ.. కన్నెర్ట్ ను విజయవంతం చేసినందుకు పూణే అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music!
We shall be back soon to sing with you all again!#2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj
— A.R.Rahman (@arrahman) May 1, 2023
Maharashtra | Pune Police stopped music maestro AR Rehman from singing during his concert last night after he continued to perform beyond the permissible time of 10 pm.
Rehman was singing his last song and while singing he did not realise that it was already past 10 pm, so our…
— ANI (@ANI) May 1, 2023