జబర్థస్త్ పంచ్ ప్రసాద్ జీవితం ఒక్కసారిగా విషాదంలోకి మళ్లింది. ఆయన గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డయాలసిస్ మీద జీవితం కొనసాగిస్తున్నారు.
జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యం కారణంగా నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అల్లాడిపోతున్నారు. ఆయన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు చెప్పిన ప్రకారం డయాలసిస్ తప్పని సరిగా చేయించుకోవాలి. డయాలసిస్ చేయించుకోకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. ఆయన భార్య అన్ని విధాల తోడు నీడగా ఉంటోంది.
ఇక, పంచ్ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా, ఆయన ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. ప్రసాద్ ఆసుపత్రిలో ఉన్న వీడియో అది. ఓ ఇంజెక్షన్ కోసం ప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. ‘‘ ఇంజక్షన్ కోసం వచ్చాం. ఆయన కుడి చేతిపై ఇప్పటి వరకు 50 ఇంజెక్షన్లు చేశారు. డయాలసిస్ నొప్పి తట్టుకోలేము. డయాలసిస్ తర్వాత క్లీడ్ ఇచ్చినపుడు కొంచెం బాగా ఉంటుంది. ప్రసాద్ ఇంజెక్షన్లు అంటే భయపడిపోతున్నాడు. అదికూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవటానికి’’ అని వివరించింది.
నిజంగా పంచ్ ప్రసాద్ బాధ వర్ణణాతీతం. ఆయన నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒంట్లో ఓపిక లేని పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు. మునుపటి కంటే ఇప్పుడు ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని పంచ్ ప్రసాద్ భార్య చెబుతోంది. ప్రసాద్ బాధను చూసి అభిమానులు బాధపడుతున్నారు. ఆయనకు త్వరగా నయం కావాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మరి, పంచ్ ప్రసాద్ అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.