పంచ్ ప్రసాద్ బబర్థస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. పంచులతో తనకంటూ అభిమానుల్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక, ఆయన గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌ను వరుస ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆయన కిడ్నీ సంబంధిత సమస్య కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ, ఆరోగ్యం మెరుగుపడినట్లు కనబడుతున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కొత్త సమస్యలు ఆయన్ని పలకరిస్తున్నాయి. పంచ్ ప్రసాద్ ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలను ఆయన భార్య వివరించారు. ఆమె మాట్లాడుతూ..
‘‘ ఇప్పుడు వేరే ఆసుపత్రికి వచ్చాం. ఇది ప్రైమ్ ఆసుపత్రి. ఆయనకు గొంతుకు సంబంధించిన థైరాయిడ్ సమస్య ఉంది. అది చాలా ఎక్కువగా ఉంది. 65 ఉండాల్సింది 2వేలకు పైగా ఉంది. దాని కోసం అల్ట్రాసౌండ్ చెప్పారు. అల్ట్రాసౌండ్ తర్వాత రిపోర్టులు చూసి డాక్టర్లు చెబుతామన్నారు. దాంట్లో గనుక ఎక్కువ అనిపిస్తే సర్జరీ చేయాలని అన్నారు. మెడిసిన్‌తో తగ్గకపోతే ఆపరేషన్ చెయ్యాలన్నారు. నేను ఇంకా ఏంటి ప్రాసెస్ అని ప్రసాద్‌కు చెప్పలేదు. థైరాయిడ్ మెడిసిన్స్‌తో తగ్గాలని కోరుకుంటున్నా.. ఆపరేషన్ అంటే కష్టం’’ అని అన్నారు. ఇక పంచ్ ప్రసాద్ దంపతులు నిన్న ఇంజెక్షన్ కోసం హాస్పిటల్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రసాద్ చేతికి ఉన్న ఇంజెక్షన్ గుచ్చిన గాయాల తాలూకా మచ్చలను ఆమె చూపించారు. ఇప్పటి వరకు 50 ఇంజెక్షన్లు గుచ్చారని ఆమె అన్నారు. డయాలసిస్ చేయించుకోవటం చాలా నొప్పితో కూడుకున్న పనని చెప్పారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ప్రసాద్ పరిస్థితి చూసి అందరూ చలించిపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మరి, పంచ్ ప్రసాద్‌ను వరుస ఆరోగ్య సమస్యలు వెంటాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.