సినీ ఇండస్ట్రీలో పెళ్లి కాకుండా ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ పెళ్లి, కెరీర్ గురించి ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగని వచ్చిన ప్రతీ రూమర్ పై హీరోయిన్స్ స్పందించడం అనేది మనం చూడలేదు. కాకపోతే ఎప్పుడైనా రూమర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాగైనా పర్సనల్ లైఫ్ పై క్రియేట్ చేస్తే మాత్రం కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు హీరోయిన్స్. అయితే.. ఆ విధంగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో సీక్రెట్ పెళ్లి అంటూ రూమర్స్ ఫేస్ చేసిన బ్యూటీ పూజిత పొన్నాడ.
తెలుగమ్మాయి అయిన పూజిత గురించి యూత్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాల్లో అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. అలాగే అడపాదడపా వేరే సినిమాలలో మంచి క్యారెక్టర్స్ ఉన్నా నటిస్తోంది. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న పూజిత.. ఈ మధ్య గ్లామర్ పాత్రలకు సై అంటోంది. రీసెంట్ గా రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది పూజిత. అయితే.. తాజాగా ‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇస్తూనే తాను ఇంకా సింగిల్ అనే విషయాన్ని చెప్పింది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ వదిన క్యారెక్టర్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది పూజిత.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని పెళ్లి చేసుకోబుతుందని, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకుందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన పూజిత.. ‘ఆ రూమర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. నా లైఫ్ లో అలాంటివేం జరగలేదు. నేనిప్పుడు సింగిల్’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పూజిత మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.