'పొన్నియన్ సెల్వన్ 2' పాన్ ఇండియాలో బాగానే అలరిస్తోంది. ఇందులో టీనేజీ త్రిషగా యాక్ట్ చేసిన అమ్మాయి.. హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి సంగతి?
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ గత కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. తమిళ నుంచి అలా వచ్చిన భారీ బడ్జెట్ మూవీ అంటే అందరూ చెప్పే పేరు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ తొలి భాగం.. గతేడాది సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కానీ తమిళంలో తప్ప ఏ భాషలోనూ హిట్ కొట్టలేకపోయింది. తాజాగా రెండో పార్ట్ రిలీజైంది. ఫస్ట్ దాని కంటే బాగుందని అన్నారు కానీ ఇది కూడా మిగతా భాషల్లో అంతంతమాత్రంగానే ఆడుతోంది. సినిమా గురించి పక్కనబెడితే అందులో యాక్ట్ చేసిన ఓ అమ్మాయి మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోహీరోయిన్లకు ఆల్రెడీ క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఆయా సినిమాల్లో ప్రేక్షకులు వీళ్లని చూసి ఎంటర్ టైన్ అవుతారు. కొన్నిసార్లు మాత్రం మిగతా యాక్టర్స్ హాట్ టాపిక్ అవుతుంటారు. అలా ‘పొన్నియిన్ సెల్వన్’ ఇద్దరు టీనేజ్ అమ్మాయిల గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. అందులో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్ చేసిన సారా అర్జున్ గురించి చాలామందికి తెలుసు. కాబట్టి ఆమె గురించి ఇప్పుడు చెప్పడం లేదు. ఇదే మూవీ టీనేజీ త్రిషగా నీలా అనే అమ్మాయి చేసింది. యువరాణిగా భలే సెట్ అయింది. దీంతో ఈమె ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
తమిళ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కవితా భారతి- నటి కన్య భారతి దంపతుల కూతురే నీలా. ప్రస్తుతం కేరళలో చదువుకుంటున్న ఈ చిన్నారి.. ‘పొన్నియిన్ సెల్వన్’ ఆడిషన్స్ లో పాల్గొనగా త్రిష కుందవి యంగ్ రోల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. యాక్ట్ చేయడంతోపాటు ప్రేక్షకుల ప్రేమని కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు కొన్ని వైరల్ గా మారిపోయాయి. సో అదన్నమాట విషయం. మరి మీలో ఎంతమంది ‘PS-2’ మూవీ చూశారు? టీనేజీ త్రిష ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ చేయండి.