ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు మైండ్ పోయే సర్ ప్రైజ్ వచ్చేసింది! ఎలాంటి చప్పుడు లేకుండానే 'ప్రాజెక్ట్ k' కొత్త వీడియోని రిలీజ్ చేశారు. అది కాస్త సమ్ థింగ్ ఫిషీ అనేలా ఉంది.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. మిగతా సినిమాల సంగతేమో గానీ ఇది కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ‘ఆదిపురుష్’ రామయణం ఆధారంగా తీస్తున్నారు. ‘సలార్’ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇదేమో హాలీవుడ్ స్టైల్లో టెక్నికల్ స్టోరీతో తీస్తున్న మూవీ. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ.. ఈ మధ్యనే ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇది చూస్తుంటే సమ్ థింగ్ ఇంట్రెస్ట్ అనేలా ఉంది. అదే టైంలో హాలీవుడ్ సినిమాలని గుర్తుచేస్తూ ఏదో పెద్ద ప్లాన్ వేశారా? అనే సందేహం వచ్చేలా చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మొన్నటివరకు పాన్ ఇండియా అన్నారు గానీ మన దగ్గరే పాన్ వరల్డ్ స్టాండర్డ్స్ తోనూ ఓ సినిమా తీస్తున్నారు. అదే ‘ప్రాజెక్ట్ k’. హాలీవుడ్ స్థాయిలో తీస్తున్న ఈ మూవీ కోసం.. కార్లు నుంచి సెట్స్ వరకు ప్రతిదీ భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు ఓ టైర్ ని తయారు చేయడం గురించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘అసెంబ్లింగ్ రైడర్స్’ పేరుతో ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండానే మరో వీడియో రిలీజ్ చేశారు. ప్రభాస్ ని ఢీకొట్టే విలన్సే రైడర్స్ అని తెలుస్తోంది. వీళ్ల కోసం తయారుచేస్తున్న సూట్స్ గురించి ఎంత కష్టపడుతున్నామో చెప్పుకొచ్చారు.
‘ప్రాజెక్ట్ k’ టీమ్ రైడర్స్ కోసం సూపర్ హీరోల సినిమాల రేంజ్ లో ఓ సూట్ ని డిజైన్ చేసినట్లు చూపించారు. బ్లాక్ సూట్ లో వీళ్లంతా హాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్నారు. విలన్సే ఈ రేంజులో ఉన్నారంటే.. ఇక ప్రభాస్ ఏ రేంజులో ఉంటాడోనని మన ఊహకే వదిలేస్తున్నారు. ఈ ప్రీ ప్రొడక్షన్ సెటప్ అంతా చూస్తుంటే.. ‘అవెంజర్స్’ని మించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడా అనిపిస్తోంది. ఈసారి దేశంలో కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా పవర్ ఏంటో చూపిస్తారు అనేలా ఇది అంచనాలు పెంచేస్తోంది. ఇదిలా ఉండగా ‘ప్రాజెక్ట్ k’ టీమ్ ఇప్పటివరకు రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. ముందు ముందు ఇంకెన్ని సర్ ప్రైజులో ఇస్తుందో చూడాలి. మరి ‘ప్రాజెక్ట్ k’ లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.