ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల చూపు మెుత్తం ఆస్కార్ అవార్డుల పైనే ఉంది. తమ దేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలకు అవార్డు వస్తుందా? రాదా? అన్న ఆసక్తి ప్రతీ సినిమా ప్రేక్షకుడిలోనూ ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో ఆస్కార్ కు నామినేట్ అవ్వడమే గొప్ప అని చాలా దేశాలు భావిస్తుంటాయి. అలాంటి క్రమంలోనే ఇండియా నుంచి అదీ మన తెలుగు పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది నాటు నాటు సాంగ్. ఇక ఆస్కార్ కు భారత్ నుంచి పంపిన చిత్రాల్లో తాజా సంచలనం కాంతార మూవీ కూడా ఉంది. రెండు విభాగాల్లో కాంతార ను ఆస్కార్ కు పంపించారు. అయితే ఆస్కార్ కు నామినేట్ అవ్వడంలో విఫలం అయ్యింది కాంతార. ఇక ఈ చిత్రం నామినేట్ కాకపోవడానికి షాకింగ్ కారణాలను వెల్లడించాడు కాంతార నిర్మాత విజయ్ కిరగందూర్.
కాంతార.. చిన్న చిత్రంగా విడుదలై ఇండియాతో పాటుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ కన్నడ సినిమా. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి, తెరకెక్కించిన సినిమా కాంతార. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. దక్షిణ కర్ణాటకకు చెందిన సంప్రదాయ కళ అయిన భూత కోల నృత్యం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. కన్నడతో పాటుగా విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం.
తాజాగా ఆస్కార్ కు భారతదేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల్లో కాంతార కూడా ఉంది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఈ మూవీ ఆస్కార్ కు పంపించారు. కానీ ఆస్కార్ కు నామినేట్ కాలేదు. కాంతార ఆస్కార్ కు నామినేట్ కాకపోవంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో స్పందించాడు నిర్మాత విజయ్ కిరగందూర్. ఆయన మాట్లాడుతూ..” కాంతార మూవీ సెప్టెంబర్ లో విడుదల అయ్యింది. దాంతో అంతర్జాతీయ, ఆస్కార్ కు కావాల్సిన స్థాయిలో ప్రచారం కల్పించలేకపోయాం. నామినేషన్స్ సమయం కూడా తక్కువ ఉండటంతో.. అనుకున్నంత పబ్లిసిటీ చేయలేదు. కాంతారకు కరెక్ట్ ప్రచారం లేకపోవడం మూలంగానే ఆస్కార్ కు, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రపంచ స్థాయి అవార్డులకు కాంతార నామినేట్ కాలేదని” నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నాడు.
అయితే ఆ లోటును కచ్చితంగా కాంతార 2 తీరుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కాంతార 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని ఈ సందర్బంగా తెలిపాడు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో షూటింగ్ ను ప్రారంభించి.. 2024 చివరి కల్లా కాంతార 2 ని రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సారి ఆస్కార్ కొల్లగొట్టడమే ధ్యేయంగా కాంతార 2ని ప్రమోట్ చేస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ వెల్లడించాడు. మరి కాంతార ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.