జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీవీ ప్రోగ్రాంలతో పాటు సినిమాలలో కూడా కనిపించే రష్మీ.. సమాజంలో జరిగే వివాదాలపై స్పందిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తాను కూడా వివాదాలలో చిక్కుకుంటుంది. ఇటీవల ఓ సినిమా విషయంలో రష్మీ తనను బ్లాక్ మెయిల్ చేసిందంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మీ – నిర్మాత బాలాజీ నాగలింగం వివాదం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
సదరు ఇంటర్వ్యూలో “రష్మీ ని ఫిలిం ఛాంబర్ గేటుకి కట్టేస్తా అన్నారట. ఎందుకు? అసలేమైంది?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగలింగం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రష్మీని నేను తిట్టిన మాట వాస్తవమే. సాధారణంగా నేను ఎవరినీ తిట్టను. రష్మీని ఎందుకు తిట్టాననే విషయానికి వస్తే.. మాతో ‘రాణిగారి బంగ్లా’ అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది. దివాకర్ బాబు దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నాడు. సినిమాలో మెయిన్ రోల్ కోసం రష్మీ గౌతమ్ అనుకోని ఆమెను కలిసి మాట్లాడితే తన రెమ్యునరేషన్ చెప్పింది.
ఇది చదవండి: టాప్ పొజిషన్ కి రావాలంటే వారితో బెడ్ షేర్! రష్మీ పోస్ట్ వైరల్ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో చేయాలనుకున్నామని, మేకింగ్ కు ఇంత ఖర్చుపెడతామనే విషయాన్ని కూడా చెప్పి.. మేం ఇంత ఇస్తాం అని ఓకే చేసుకున్నాం. అప్పుడు రష్మీ గుంటూరు టాకీస్ సినిమా చేసింది. అంతా ఓకే అనుకున్న తర్వాత షూటింగ్ చేసింది. సినిమా పూర్తయ్యింది. ఓ సాంగ్, డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు రష్మీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని భావించి హీరోని మార్చేయమని అంది.
నేను ఆమెతో మాట్లాడాను. అప్పుడామె నాకు నాగబాబు గారు తెలుసు. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలుసు అని చెప్పింది. మిమ్మల్ని టీవీ9కి ఎక్కిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరించే ప్రయత్నం చేసింది. అంటే నాగబాబుగారు నాకు తెలియదా.. శ్యాం ప్రసాద్ రెడ్డిగారు తెలియదా. నేను భూమి పుట్టినప్పుడు పుట్టినోడిని. 1974లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. రష్మీ చిన్నా పెద్దా లేకుండా నాతో మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. అప్పుడు నేను తనను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని అన్నాను.నేను ఆమెను నిజం చెప్పమని, నిజాయతీగా ఉండమని బెదిరించాను. నా వయసెంత, రష్మీ గౌతమ్ వయసెంత. ఒప్పుకున్న రెమ్యునరేషన్ తీసేసుకుని చివరల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. చివరకు మూడు నెలల పాటు సినిమాను ఆపింది కానీ.. చివరకు వచ్చి నటించింది. నేను శ్రీదేవిగారు, రాధగారు వంటి గొప్ప గొప్ప హీరోయిన్స్‌ను చూశాను. వాళ్లు టైమింగ్ అంటే టైమింగ్.. కానీ నటన పరంగా రష్మీ చాలా బాగా నటించింది. వన్ మోర్ టేక్ అని ఎప్పుడూ అడగలేదు.. యాక్టింగ్ ఓకే కానీ మెంటాలిటీ బాగా లేదు’ అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. మరి రష్మీ – నిర్మాతల వివాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.