టాలీవుడ్ లోని కొంతమంది హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫోలోయింగ్ ఉంది. ఈ లిస్ట్ లో ముందుంటారు డైనమిక్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. పుట్టిన రోజు, సినిమా రిలీజ్, ఆడియో ఫంక్షన్ ఇలాంటిది ఏ వేడుక జరిగినా.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదనే చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటరా..? యూవీ క్రియేషన్ కో ఫౌండర్ నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి ఇటీవల ఓ పోస్ట్ చేశారు.
ప్రభాస్ పెట్ డాగ్ బ్లూ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పెట్ లవర్ కాబట్టి.., సరదాగా ఈ పోస్ట్ చేశారు. కానీ.., యూవీ నిర్మాతల నుండి రాధే శ్యామ్ అప్డేట్స్ రాక ప్రభాస్ ఫ్యాన్స్ అసలే కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ నిర్మాత ప్రమోద్.. ప్రభాస్ కుక్క గురించి పోస్ట్ చేయడం తో ఓ ఫ్యాన్ కాస్త వైల్డ్ గా కామెంట్ చేశాడు.సినిమా అప్ డేట్ ఇవ్వకుండా ఇలాంటివి ఏంటన్న.. అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు.
అయితే..,దీనికి నిర్మాత ప్రమోద్ కూడా అంతే అగ్రెసివ్ గా స్పందించాడు. తనని టార్గెట్ చేసిన ఆ ఫ్యాన్ ని హెచ్చరిస్తూ.. అసభ్యకరమైన పదాలతో కూడిన ఓ పోస్ట్ ని రిప్లయ్ గా ఇచ్చారు ప్రమోద్. పగిలిపోద్ది అని అర్ధం వచ్చేలా ఉన్న ఈ రిప్లయ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కోపానికి కారణం అవుతోంది.అప్డేట్స్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఇలానే రియాక్ట్ అవుతారు. అంత మాత్రం దానికి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఇలా కామెంట్ చేస్తాడా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి.. యూవీ క్రియేషన్స్ నిర్మాతలకి, ప్రభాస్ ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న ఈ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Update lu ivakunde unde badhulu dhanidhi pettuko pramod anna
— రుద్ర ™ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rudra__1) September 3, 2021