DJ Tillu 2: ‘‘డీజే టిల్లు’’ చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి పెద్ద హిట్ అయింది. హీరో జొన్నలగడ్డ సిద్ధు వన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించారు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలవరీ, పంచులతో సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేశారు. చాలా కాలం పాటు హిట్లు లేకుండా ఉన్న సిద్ధూకు ‘డిజే టిల్లు’ బూస్టప్ ఇచ్చింది. ఇక, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతోందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజే టిల్లు సీక్వెల్‌పై నిర్మాత నాగ వంశీ స్పందించారు. తన ట్విటర్ ఖాతాలో దేవుళ్ల పటాల ముందు ఉంచిన సినిమా స్క్రిప్టుకు సంబంధించిన బౌండ్ బుక్ ఫొటోను షేర్ చేశారు. ‘‘ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాంచైజీ.. రెండో రౌండ్ కోసం సిద్ధమవుతోంది.
ఈ క్రేజీ అడ్వెంచర్ చిత్రీకరణ ఆగస్టునుంచి ప్రారంభమవుతుంది’’ అని పేర్కొన్నారు. అయితే, నాగవంశీ నేరుగా చెప్పకపోయినా.. ఆయన ట్వీట్ చేసింది ‘డీజే టిల్లు’ గురించేనని టాక్. కాగా, ఈ సినిమాకు కథను అందించిన వారిలో సిద్ధు కూడా ఉన్నారు. ప్రస్తుతం సీక్వెల్‌కు కూడా తన టీంతో కలిసి సిద్ధు కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజే టిల్లును మించి సీక్వెల్ ఉండేలా కథను పక్కాగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇక మొదటి పార్టులో నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ఫిష్ వెంకట్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే, మొదటి పార్టులో ఉన్న పాత్రలతోటే రెండో పార్టును తీస్తారా? లేక కొత్త పాత్రలతో ముందుకు తీసుకెళతారా? అన్నది తెలియరాలేదు. మరి, డీజే టిల్లు సీక్వెల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The most awaited Franchise… Gearing up for Round 2 🔥
Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ
— Naga Vamsi (@vamsi84) June 25, 2022
ఇవి కూడా చదవండి : Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన శోభిత ధూళిపాళ..!