టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు దిల్ రాజు. పేరుకే ప్రొడ్యూసర్ గానీ ఆయనే ఇండస్ట్రీని శాసిస్తున్నారనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వీటిని ఆయన ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ తమిళ సినిమా.. తెలుగులోనూ ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో విడుదల చేసే విషయమై గొడవలు అని చెప్పాం కానీ చిన్నపాటి వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు.
ఇక విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాతగా అందరికీ తెలుసు. కానీ ప్రొడ్యూసర్ కాకముందు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫీల్డ్ లో కొనసాగుతున్నారు. నైజాం, వైజాగ్, కృష్ణా లాంటి చోట్ల ఆయన.. పలువురు స్టార్ హీరోల సినిమాలు కొని రిలీజ్ చేస్తుంటారు. అలా ప్రతి ఏడాది తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో కలిపి 25కు పైనే సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అయితే గతంలో దిల్ రాజు.. సంక్రాంతి సందర్భంగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకూడదనే కామెంట్స్ చేశారు! ఇప్పుడదే విషయాన్ని పట్టుకున్న నిర్మాతల మండలి.. ‘వారసుడు’ డబ్బింగ్ సినిమా కాబట్టి.. తక్కువ థియేటర్లలో విడుదల చేసుకోవాలని సూచించింది.
ఇక విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాల తర్వాత తమ సినిమా అని దిల్ రాజు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక 2017లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేశ్ ‘స్పైడర్’ సినిమాలు.. థియేటర్ల దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. ఈ రెండు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు కావడంతో భారీ నష్టాల్ని ఎదుర్కొన్నట్లు స్వయంగా ఆయనే తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే అదే ఏడాది తనకు ప్రొడ్యూసర్ గా వరస హిట్స్ రావడంతో కాస్త తట్టుకుని నిలబడగలిగానని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే ఎవరైనా అయితే మాత్రం కచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవారని లేదంటే ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఈ మధ్యే ‘వారిసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. తమిళంలో విజయ్ సూపర్ స్టార్ కాబట్టి.. ప్రమోషన్స్ అన్నీ అక్కడే ఎక్కువగా చేస్తున్నారు. తెలుగులో మాత్రం ఇంకా స్టార్ట్ చేసినట్లు లేరు. మరి సంక్రాంతి ఏయే సినిమాలు హిట్ అవుతాయనేది చూడాలి? మరి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.