సినీ తారలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఉన్న స్టార్ డమ్ కారణంగా బయట స్వేచ్ఛగా తిరగలేరు. సినిమాల విషయానికి వస్తే కూడా నచ్చిన సినిమాలను జనాల మధ్యలో చూసేందుకు కొందరు స్టార్స్ ఇష్టపడుతుంటారు.కానీ వారికున్న ఫేమ్ కారణంగా ఇబ్బందులు ఎదురు కావచ్చని థియేటర్లకు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు. ఇంట్లోనే స్పెషల్ గా సినిమాలను వీక్షిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో స్టార్స్ తమకు నచ్చిన సినిమాను జనాలతో పాటు చూడాలి అని ప్రత్యేకంగా మాస్క్ వేసుకుని మరీ వెళ్తున్నారు. ఈక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రహస్యంగా ఒక సినిమా చూశారు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ ఓ మూవీ ప్రీరిలీజ్ లో ఈవెంట్ వెల్లడించారు.
ప్రత్యేకంగా మాస్క్ వేసుకొని ఎవరికీ తెలియకుండా మారువేషంలో కూడా సినిమాలు చూడవచ్చు అనే ఐడియా కొందరు స్టార్స్ ఫాలో అవుతున్నారు. ఆ మధ్య కాలంలో సాయి పల్లవి కూడా ప్రత్యేకంగా బుర్కా వేసుకుని శ్యామ్ సింగరాయ్ సినిమాను వీక్షించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా F3 సినిమా చూసినట్లుగా ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. సాధారణంగా అల్లు అర్జున్ తన ఇంట్లో ఉన్న క్యూబ్ థియేటర్లోనే ప్రత్యేకంగా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు. కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా కూడా హోమ్ థియేటర్ లో నే తన ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన బన్నీ..ఇటీవల వచ్చిన F3 సినిమాతో పాటు మరో రెండు సినిమాలను అలానే చూడాలని అనుకున్నాడట.
ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున సరదాగా గడిపిన అనసూయ.. ఫొటోస్ వైరల్!అయితే అల్లు అరవింద్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఇలాంటి సినిమాను ఒక మాస్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూస్తేనే బాగుంటుంది అని చెప్పారట. కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి థియేటర్ లో ఉండే వాతావరణం వేరైటిగా ఉంటుందని వివరణ ఇవ్వడంతో బన్నీ కూడా దొంగచాటుగా ఎవరికీ డౌట్ రాకుండా కూకట్ పల్లిలోని మాస్ థియేటర్లో సినిమా చూసినట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఈ క్రమంలో బన్నీ మాస్ థియేటర్ల సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసినట్లు తెలిసింది. మరి..నిర్మాత అల్లు అరవింద్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.