బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు అమెరికాలో సెటిలైపోయింది. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జొనాస్ ను పెళ్లాడిన ప్రియాంక అక్కడే ఉంటోంది. హాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ‘సైటడెల్’ అనే వెబ్ మూవీతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ముంబైలో ఇల్లుతో పాటు ఆస్తులు బాగానే సంపాదించింది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా ఎంత ఇష్ట పడి రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కొనుగోలు చేసింది. ఆ కారు కొంతకాలంగా ముంబైలోనే ఉంటుంది.
ఈ కారును ప్రియాంక చోప్రా ఇంతో ఇష్ట పడి రూ. 2.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బాలీవుడ్ లో రోల్స్ రాయిస్ కారు కొన్నది ప్రియాంక చోప్రానే. ఇప్పుడు ఈ కారును అమెరికాకు తీసుకెళ్లడంలో ఈ భామ తీవ్ర ఇబ్బందులు పడుతుందట. దీంతో చేసేది ఏమీ లేక తనకు బాగా ఇష్టమైన ఈ కారును అమ్మేసిందని సమాచారం. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ కారును కొన్నట్టు తెలుస్తోంది.