గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా గురించి కొన్ని రోజుల క్రితం వరకు మీడియాలో అనేక రకాల పుకార్లు షికారు చేశాయి. ఆమె వైవాహిక జీవితం గురించి.. విడాకులు తీసుకోబుతున్నారంటూ రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో అత్యంత సంతోషకరమైన వార్తను తెలియజేసి.. అభిమానులను ఆనందంలో ముంచెత్తారు ప్రియాంక చోప్రా. తాను తల్లి అయినట్లు ప్రకటించారు ప్రియాంక చోప్రా. ఈ వార్త చదివి తొలుత అందరూ షాక్ అయ్యారు. అసలు ప్రియాంక గర్భవతి ఎప్పుడు అయ్యిందని ఆలోచించసాగారు. ఆ తర్వాత బిడ్డను దత్తత తీసుకుందేమోనని భావించసాగారు. కానీ అవేవి కాదని తెలిపారు ప్రియాంక. సరోగసి విధానం ద్వారా తాను, నిక్ జోనాస్ తల్లిదండ్రులమయ్యామని తెలిపారు. ఈ మేరకు ప్రియాంక తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు..
సరోగసి ద్వారా మా జీవితాల్లో వచ్చిన చిన్నారిని చూసి మేం సంతోషంతో ఉప్పోంగిపోతున్నాం. ఇలాంటి సంతోషకరమైన సమయంలో కుటుంబంతో గడిపేందుకు మాకు కావాల్సిన ప్రైవసీ ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు అంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు ప్రియాంక చోప్రా. ఈ వార్త తెలిసిన అభిమానులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రియాంకకు అభినందనలు తెలుపుతున్నారు. ఇదే పోస్ట్ ని నిక్ జోనాస్ కూడా తన ఇస్ స్టాలో షేర్ చేశారు.
ఇది కూడా చదవండి : రిచ్చెస్ట్ ఇన్ స్టాగ్రామర్ గా ప్రియాంక, ఒక్కో పోస్ట్ కు కోట్లు సంపాదిస్తున్న స్టార్స్
బాలీవుడ్ నుంచి హలీవుడ్ కి వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. వయసులో తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2017లో జరిగిన అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం 2018, డిసెంబర్ లో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.