బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. మోడల్ గా కెరీర్ ఆరంభించి 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 2002లో తమిళ స్టార్ హీరో విజయ్ సరసన తమిళన్ అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలతో విజయం అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా నటించి గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. తనకన్నా చిన్నవాడైన నిక్ జోసన్ ని పెళ్లాడింది. ఇటీవల ఈ జంట సరోగసి పద్దతిలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రాపై సంచలన ఆరోపణలు చేసింది మాజీ మిస్ బార్బడోస్ లీలానీ.
2000 సంవత్సరంలో జరిగిన మిస్ వరల్ట్ పోటీలో ప్రియాంక చోప్రా కిరీటాన్ని రిగ్గింగ్ చేసి సొంతం చేసుకుందని మాజీ మిస్ బార్బడోస్ లిలానీ ఆరోపణలు చేసింది. అప్పటి మిస్ వరల్డ్ పోటీలపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో మాజీ మిస్ బార్బడోస్ ఈ విధంగా పేర్కొంది.. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలో నేను కూడా పాల్గొన్నాను.. ఆ సంవత్సరం మిస్ వరల్డ్ గా ప్రియాంక చోప్రా కిరీటాన్ని దక్కించుకుంది. 1999, 2000 రెండు సంవత్సరాలు కూడా భారత్ కే మిస్ వరల్డ్ కిరీటాలు దక్కాయి.. దానికి స్పాన్సర్లే కారణం.. ఎందుకంటే ఆ రెండు సంస్థలు కూడా భారత్ కు చెందినవే.. అందుకే ఆమెకు అంత సులభంగా మిస్ వరల్డ్ కిరీటం దక్కింది.
వాస్తవానికి ప్రియాంక చోప్రా పెద్ద అందగత్తె ఏం కాదు.. ఆమె తోటి కంటెస్టెంట్స్ తో రిహార్సల్స్ లో కూడా ఏమీ పాల్గొనలేదు.. తన రూమ్ కి ఆమెకు ఇష్టమైన భోజనం వెళ్లేది.. మిగిలిన పోటీదారులకు అలాంటి వసతులు ఏవీ ఉండేవి కావు.. ఆమెకే అన్ని రకాల వసతులు లభించేవి. ఆ సమయంలో తాము ప్రశ్నించే పరిస్థితిలో లేము. అంతేకాదు ప్రియాంక చోప్రాకు ప్రత్యేకమైన డిజైనింగ్ తో దుస్తులు పంపించేవారు.. ఆమెను మాత్రమే ఒంటరిగానే బీచ్ లో ఫోటో షూట్ చేసేవారు.. మమ్ముల్ని మాత్రం గుంపులుగా తీశారు. ఇలా ప్రతి విషయంలో స్పాన్సర్ల ఫెవరేటీజం వల్ల మాకు అన్యాయం అయ్యింది.. ఆ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో అంతా ఆమెకే అనుకూలంగా మార్చారని సంచలన ఆరోపణలు చేసింది మిస్ బార్బడోస్ లీలానీ. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.