ప్రియమణి.. బుల్లితెర ప్రేక్షకుల నుంచి వెండితెర వరకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు అక్కర్లేని పేరు. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్‌గా.. ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్-1, 2, భామా కలాపం వంటి వెబ్ సిరీస్‌లతోనూ అభిమానులను అలరించింది. ప్రియమణి అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సెలబ్రిటీలకు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా ప్రధాన సాధనం అనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో మంచి- చెడు, పాజిటివ్- నెగిటివ్ రెండూ ఉంటాయి. ప్రతిసారి పాజిటివ్ కామెంట్స్ రావాలనేం లేదు. అయితే నెగెటివ్ కామెంట్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయంపై ప్రియమణి స్పందించింది.
ఇదీ చదవండి: క*డోమ్ ప్రమోషన్ లో రెచ్చిపోయిన నిధి అగర్వాల్! షాకింగ్ కామెంట్స్!
‘సోషల్ మీడియా లైఫ్‌లో ఒక భాగమే గానీ.. అదే లైఫ్ కాదు. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఏం అనాలనిపిస్తే అది అనే హక్కు ఉందని చాలా మంది ఫీలవుతుంటారు. నా మీద వచ్చే కామెంట్స్, మీమ్స్ చూసి నవ్వుకుంటాను. కానీ, కొందరు హద్దు మీరి కామెంట్ చేస్తుంటారు. మితి మీరిన నెగెటివ్ కామెంట్స్ ను సహించలేను. అలాంటి వారిని వెంటనే బ్లాక్ చేస్తుంటాను’ అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇంక సినిమాల విషయానికి వస్తే వివేక్ దర్శకత్వంలో ‘కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ప్రియమణితో పాటు సన్నీలియోన్, జాకీషార్ఫ్, సారా నటిస్తున్నారు. పూర్తి డీ గ్లామర్ రోల్‌లో కనిపించబోతోంది. ప్రియమణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.