ఈమె దగ్గర సినిమాల కంటే టాలెంట్స్ ఎక్కువున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఉన్నాయి కాబట్టి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆమెని గుర్తుపట్టారా?
ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభంలోనే ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. కానీ ఏం లాభంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఒక్కొక్కరి ఒక్కో టైంలో లక్ కలిసొస్తుంది. ఈమెకి అలానే జరిగింది. హీరోయిన్ గా కంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయిపోయింది. ఓటీటీ వల్ల ఆలో ఇండియా ఫేమస్. ఇంకా చెప్పాలంటే స్పెషల్ సాంగ్, డ్యాన్స్ షోకి జడ్జిగా.. ఇలా ఈమెలో చాలా టాలెంట్స్ ఉన్నాయండోయ్. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ హీరోయిన్లలో తెలుగమ్మాయిలు చాలా తక్కువే. అయితేనేం మిగతా భాషల నుంచి ఇక్కడొస్తున్న చాలామంది ముద్దుగుమ్మలు.. తెలుగు నేర్చుకుని, సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఏళ్లకు ఏళ్ల స్టార్ హోదాని కొనసాగిస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా సేమ్ అలాంటిదే. ఆమెనే ప్రియమణి. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2003లో ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు మూవీతో నటిగా మారిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 20 ఏళ్లుగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.
ఈ బ్యూటీకి ఉన్న టాలెంట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో పరుత్తివీరన్ (తెలుగులో ‘మల్లిగాడు’) అనే తమిళ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది గానీ గుర్తింపు అంతంత మాత్రమే. ‘ద్రోణ’లో అయితే ఏకంగా బికినీలో కనిపించి సెగలు పుట్టించింది. షారుక్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో ఐటమ్ సాంగ్ చేసి వావ్ అనిపించింది. ఓటీటీలో వచ్చిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఈమె కెరీర్ కి ఓ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో తెలుగు, తమిళంలో ఇప్పుడు యాక్టింగ్ స్కోపు ఉన్న క్యారెక్టర్స్ అంటే అందరూ ఈమె వైపు చూస్తున్నారు. కొన్ని సీజన్లు ‘ఢీ’ షోకి జడ్జిగానూ చేసింది. త్వరలో ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. సో అదన్నమాట విషయం. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు? కింద కామెంట్ చేయండి.