తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమైంది ప్రియా భవానీ శంకర్ . చినబాబు, ఏనుగు, తిరు వంటి చిత్రాల్లో ఇక్కడి వారిని పలికరించింది. అలాగే తెలుగులో కళ్యాణం కమనీయం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల జయం రవి సరసన నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, లారెన్స్‌తో రొమాన్స్ చేసిన రుద్రన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి.
బుల్లితెరపై తమను తాము నిరూపించుకుని వెండితెరపై హీరోయిన్లుగా ఛాన్సులు కొట్టేస్తున్నారు కొంత మంది నటీమణులు. అటువంటి వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. తమిళ సీరియల్స్‌లో చేసిన ఈ భామ.. 2017లో మేయాదమాన్ సినిమాతో వెండితెర మీదకు వచ్చింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమైంది. చినబాబు, ఏనుగు, తిరు వంటి చిత్రాల్లో ఇక్కడి వారిని పలికరించింది. అలాగే తెలుగులో కళ్యాణం కమనీయం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల జయం రవి సరసన నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, లారెన్స్‌తో రొమాన్స్ చేసిన రుద్రన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. కాగా, ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ షూటింగ్ దశలోనూ, విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రియా భవాని శంకర్ ఏ విషయమైనా ఓపెన్‌గా చెబుతుంటుంది. డబ్బులు ఎక్కువగా వస్తాయని సినీ ఇండస్ట్రీలోకి వచ్చానన్న ఈ అమ్మడు.. అందాల ఆరబోతకు కూడా సై అంటోంది. రుద్రన్ చిత్రంలో లారెన్స్‌తో రొమాంటిక్ సన్నివేశాలు అందాలను ఆరబోసిందనే చెప్పాలి. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్‌తో ఓపెన్ గా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది. రాజ్ వేల్ అనే వ్యక్తి ప్రేమలో మునిగి తేలుతుంది ఈ భామ. తనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను.. సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. భాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న, ప్రేమలో ఉన్నామని చెబితే సినిమా అవకాశాలు రావని, ఫేమ్ తగ్గిపోతుందని భావిస్తున్న నేటి హీరోయిన్లు ఉన్నసినిమా పరిశ్రమలో.. ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
తనకు నచ్చినదే చేస్తూ సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకెళుతోంది. తాజాగా రాజ్ వేల్.. తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ కు వెళ్లిందీ ఈ భామ. వీటికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. అందులో అతడితో కలిసి ముద్దు మురిపాల్లో తేలియాడింది ఈ అమ్మడు. అతడితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి దూత అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అంతేకాకుండా మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి, సత్యదేవ్ పక్కన ఓ సినిమాలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. డీమాంటీ కాలనీ 2, భారతీయుడు 2ల్లో కనిపించబోతోంది ఈ అమ్మడు.