ప్రస్తుతం ఈ ముద్దు సీన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీటిపై తమ దైన స్టైల్లో స్పందిస్తున్నారు. విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి.. దర్శకుడిగా మారిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ, నటుడు అవుదామని వచ్చి.. దర్శకుడిగా మారినా కూడా..నటన మీద ఆసక్తితో దర్శకత్వాన్ని వదులుకున్న వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య ఒకరు. ఈయన 1980లలో నటుడిగా కొన్ని చిన్న పాత్రల్లో నటించారు. తర్వాత దర్శకుడిగా మారారు. ఎన్నో హిట్టు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దర్శకత్వానికి గుడ్‌బై చెప్పి.. నటన మీద ఫోకస్ పెట్టారు. హీరోగా.. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు.
తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తున్నారు. తాజాగా, ఆయన హీరోగా నటించిన ‘ బొమ్మై’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. ఇందులోని కొన్ని ముద్దు సీన్లు కొంచెం హద్దులు దాటి ఉండటమే. కొన్ని సెకన్లు ఈ ముద్దు సీన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. కాగా, రాధా మోహన్ దర్శకత్వం వహించిన ‘బొమ్మై’ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, ప్రియ భవానీ శంకర్‌లు జంటగా నటిస్తున్నారు. చాందినీ తమిళరసన్ మరో కథానాయకిగా చేస్తోంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరినుంచి తాజా ట్రైలర్ వరకు అన్నింటికి మంచి స్పందన వచ్చింది. మరి, సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్న బొమ్మై సినిమాలోని ఎస్‌జే సూర్య, ప్రియా భవానీ శంకర్ ముద్దు సీన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.