పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ హీరోయిన్. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హిట్ లేక కెరీర్ ని ఫసక్ చేసుకుంది. ఆమె ఎవరో గుర్తొచ్చిందా?
హీరోయిన్ కావడం గొప్ప కాదు. సినిమాలు చేసి, కెరీర్ నిలబెట్టుకుంటే అప్పుడు గ్రేట్ అంటారు. చాలామంది ముద్దుగుమ్మలకు ఇది తెలియకు కెరీర్ ని మొత్తం ఫసక్ చేసుకుంటున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న భామ కూడా సేమ్ ఇదే బాపతు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే అంటే తొలి మూవీతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాతే కెరీర్ ని మొత్తం బిస్కెట్ చేసుకుంది. ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు. దీంతో అరడజను సినిమాలైనా చేయకుండా కెరీర్ కి పుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ బిజీగా ఉంది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
ఇక విషయానికొస్తే.. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. నటి కావాలనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండేసరికి చదువు పూర్తవగానే ముంబయి వచ్చేసింది. ఓ థియేటర్ గ్రూప్ లో జాయిన్ అయి, నటిగా మారే ప్రయత్నం చేసింది. అలా ఆడిషన్స్ ఇస్తూ చాలా సినిమాలకు ట్రై చేసింది. ఫైనల్ గా ‘ప్రేమకావాలి’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంటరైంది. ఆమె పేరే ఇషా చావ్లా. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరో నాలుగు సినిమాల్లో నటించింది కానీ అన్ని యావరేజ్ గా నిలిచాయి. ఈమెకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
‘ప్రేమకావాలి’ మూవీలో చాలా క్యూట్ గా కనిపించి స్టార్ హీరోయిన్ అవుతుందని.. ఇషా చావ్లాని చూసిన చాలామంది అనుకున్నారు. సునీల్ తో చేసిన ‘పూలరంగడు’ కాస్త పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘శ్రీమన్నారాయణ’, మిస్టర్ పెళ్లి కొడుకు, జంప్ జిలానీ లాంటి మూవీస్ చేసింది కానీ హిట్ అయితే అందుకోలేకపోయింది. కన్నడలోనూ 2016లో ‘విరాట్’ చిత్రం చేసింది గానీ ఈమె కెరీర్ కి అదేం ప్లస్ కాలేదు. దీంతో అదే చివరి మూవీ అయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మరో ప్రాజెక్టులో నటించలేదు. చేసినవి కొన్ని అలానే సెట్స్ పై ఉండిపోయాయి. ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకుండా, తన ఫ్యామిలీతో కలిసి దిల్లీలో ఉంటోంది. సో అదన్నమాట విషయం. మరి ఈమె చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు? కింద కామెంట్ చేయండి.