ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి చాలా కామన్ గా భావిస్తున్నారు. షూటింగ్ మొదలయ్యే సమయంలో కలుసుకొని.. షూటింగ్ అయిపోయాక ప్యాకప్ చెప్పుకునే టైంకి విడిపోయినట్లుగా ప్రేమకథలు నడిపిస్తున్నారు. ఒకరితో ప్రేమలో పడటం.. బయట ప్రపంచానికి ప్రేమలో ఉన్నామని ప్రకటించడం.. కొన్ని రోజులపాటు కలిసి తిరగటం.. ఆపై మాకు సెట్ అవ్వట్లేదని విడిపోవడం.. ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడదే కల్చర్ సౌత్ లో కూడా స్ప్రెడ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇవే కథలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇదే బ్రేకప్ లిస్టులో చేరాడు పాపులర్ సింగర్, లిరిసిస్ట్ ప్రతీక్ కుహద్. ప్రియురాలితో బ్రేకప్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు చూసి రెస్పాండ్ అవ్వడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ సింగర్ ప్రతీక్ కుహద్.. నిహారిక ఠాకూర్ అనే ఆమెతో కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి ఉన్నప్పుడు కొత్త కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవాడు. ఇంతలోనే ఏమైందో గానీ.. ప్రతీక్ – నిహారిక ఇద్దరూ తమ ప్రేమను పేపర్ లా మడిచి, డస్ట్ బిన్ లో పడేశారు. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఆఖరికి ప్రతీక్ వరకు వెళ్ళింది. ఎట్టకేలకు తనపై వస్తున్న వార్తలపై ప్రతీక్ స్పందించాడు. నిహారిక ఠాకూర్ తో బ్రేకప్ అయిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు. అంతేగాక కొద్దిరోజులుగా ఈ విషయం గురించి తాను మాట్లాడలేకపోయానని, ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ మ్యూజిక్ పై ఫోకస్ పెట్టానని ప్రతీక్ చెప్పడం విశేషం. ఇక ప్రతీక్ కెరీర్ విషయానికి వస్తే.. కోల్డ్/మెస్ అనే సాంగ్ ద్వారా సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు ప్రతీక్. ఏకంగా మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఫేవరేట్ సాంగ్స్ లిస్ట్ లో ‘కోల్డ్/మెస్’ని చేర్చుకునేంత ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ప్రతీక్ – నిహారికల బ్రేకప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.