కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదోరోజు కూడా రాఖీ భాయ్ హవా ఏ మాత్రం తగ్గలేదు. నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ చేరిన ఈ సినిమా ఐదో రోజు మరో రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్స్ 600 కోట్ల గ్రాస్ ను దాటి ఇంకా దూసుకుపోతోంది. ఇంక కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే సోమవారం రోజు కూడా 25 కోట్లు దాటి వసూళ్లు రాబట్టింది. మొత్తం ఐదు రోజుల్లో బీ టౌన్లో 219.56 కోట్లు కొల్లగొట్టింది. కేజీఎఫ్ 1 నుంచి హిందీలో ప్రేక్షకులు రాఖీ భాయ్ అభిమానులుగా మారిపోయిన విషయం తెలిసిందే.
అటు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోనూ కేజీఎఫ్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. ప్రశాంత్ నీల్– యష్ ఇద్దరికీ సినీ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికాడంటూ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాలుగు రోజుల్లో 500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఐదో రోజు వరల్డ్ వైడ్, లాగ్వైంజ్ వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
కన్నడ:
5 Days – ₹ 100.00Cr
హిందీ:
Day1 – ₹53.95Cr
Day2 – ₹46.79Cr
Day3 – ₹42.90Cr
Day4 – ₹ 50.35Cr
Day5 – ₹ 25.57Cr
Total – ₹ 219.56Cr
తమిళం:
5 Days – ₹ 36.25Cr
మలయాళం:
5 Days – ₹ 33.75Cr
తెలుగు:
5 Days – ₹ 93.00Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా:
5 Days – ₹ 36.44Cr
ఓవర్సీస్:
5 Days – ₹ 104.20Cr
వరల్డ్ వైడ్(గ్రాస్) – ₹ 623.80Cr
బాక్సాఫీస్ మాన్‌స్టర్ రాఖీభాయ్ సృష్టిస్తున్న కలెక్షన్స్ సునామీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KGF2 is UNSTOPPABLE… SUPERB HOLD on a working day [Mon]… Eyes ₹ 270 cr [+/-] in *extended Week 1*… Should cross #Dangal *lifetime biz*, if it maintains the pace… Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr. Total: ₹ 219.56 cr. #India biz. pic.twitter.com/MFUVWTXTJB
— taran adarsh (@taran_adarsh) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.