ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూసిన మోస్ట్ అవైటెడ్ సినిమా కేజీఎఫ్-2 విడుదలైంది. సినిమాపై పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా అందరు ఫ్యాన్స్ నుంచి మంచి రాస్పెన్స్ సొంతం చేసుకుంది. మొత్తం 10 వేల స్క్రీన్స్ తో భారీగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 6 వేలు స్క్రీన్లు, విదేశాల్లో 4 వేల స్క్రీన్స్ లో విడుదల జరిగింది. సౌత్ ఇండియాలోనే 2,600 స్క్రీన్స్ లో అట్టహాసంగా రిలీజ్ చేశారు. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లతోనే రికార్డులు సృష్టించింది. ఇంక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే దుమ్ము రేపిందనే చెప్పాలి.
ఫస్ట్ కలెక్షన్స్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 కన్నడ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని జోరుగా టాక్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 170(అంచనా) కోట్ల వరకు వసూలైనట్లు తెలుస్తోంది. అదే నిజమైతే కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసిందనే చెప్పాలి. కేజీఎఫ్ వన్ తో వచ్చిన క్రేజ్ కానివ్వండి.. ఛాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్న తీరు చూస్తే అది సాధ్యమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 44 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయనే వార్త వింటేనే అర్థమవుతుంది. ఇదే నిజమైతే ఇంక కన్నడ ఇండస్ట్రీలో కూడా బాహుబలి తరహాలో కేజీఎఫ్ రికార్డ్స్- నాన్ కేజిఎఫ్ రికార్డ్స్ అని కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది అనడం అతిశయోక్తి కాదేమో.
ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా..
నార్త్ ఇండియా- 65 నుంచి 70 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 38 కోట్లు
కర్ణాటక – 32 కోట్లు
తమిళనాడు-కేరళ: 18 కోట్లు
ఓవర్సీస్- 20 కోట్లు
ఓవరాల్ గా 170 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్‌గా యష్ స్థానాలు స్థిరపడి పోయాయనే చెప్పాలి. కేజీఎఫ్ ఛాప్టర్ 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.