Prashanth Neel: ప్రశాంత్ నీల్ సృష్టించిన కేజీఎఫ్ ప్రపంచం ఇంకా ప్రేక్షకుల ముందు కదలాడుతూనే ఉంది. రాకీ భాయ్ సాహసాలు మైండ్‌నుంచి పోవటం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణ ప్రేక్షకులు, కేజీఎఫ్ అభిమానులు ఇంకో భాగం ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉన్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన మొదటిరోజునుంచే ఛాప్టర్ 3 ఉండబోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 3 గురించిన ప్రస్తావన రావటం దీనికి బలాన్నిచ్చింది. అయితే, కేజీఎఫ్ 3 ఉంటుందా? లేదా అన్న దానిపై చాలా కాలం నుంచి చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 ఉంటుందా? లేదా? అన్న దానిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టత ఇచ్చారు. కేజీఎఫ్ ఛాప్టర్ 3 తీసే అవకాశం ఉందని తేల్చి చెప్పారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘‘ కేజీఎఫ్ ఛాప్టర్ 3 తీసే అవకాశం ఉంది. అది కూడా తీయాలనుకున్నపుడు మాత్రమే తీస్తాం. ప్రేక్షకులు కేజీఎఫ్ ప్రపంచాన్ని, అందులోని పాత్రలను ఎంతో ప్రేమించారు. మేము దాన్ని కొనసాగిస్తాం. ఎప్పుడని మాత్రం తెలీదు. కానీ, కొనసాగిస్తాం. కేజీఎఫ్ 3 తీయాలన్న ఆలోచన ఉండింది. కానీ, ఇప్పుడు కేజీఎఫ్‌నుంచి పెద్ద బ్రేక్ కావాలి. కచ్చితంగా కేజీఎఫ్ 3 కోసం మళ్లీ తిరిగివస్తాం’’ అని అన్నారు. కాగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కన్నడ సినిమా చరిత్రలో ఓ చిత్రం ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ఇదే మొదటిసారి. కేజీఎఫ్ సినిమా సాధించిన విజయంతో కన్నడ సినిమా స్థాయి దేశ వ్యాప్తమయింది. మరి, కేజీఎఫ్ 3 ఎలా ఉండబోతోందన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: సూపర్ హిట్ తమిళ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్