ప్రణీత సుభాష్.. గుండ్రని పెద్ద పెద్ద కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. కన్నడలో పోకిరి రీమేక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. అందం, అభినయం, నటన అన్నీ ఉన్న స్టార్ హీరోయిన్ అనే హోదా మాత్రం దక్కించుకోలేకపోయింది. 2021లో వివాహం చేసుకున్న ఈ భామ.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం అమ్మగా జీవితంలోని మధుర క్షణాలను అనుభవిస్తోంది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన కుమార్తెను కనిపించీ కనిపించకుండా చూపించీ చూపించకుండా వీడియో షేర్ చేసింది. ఆ చిన్నారి వీడియో చూసిన ఫ్యాన్స్ ముద్దుగా ఉందంటూ కామెంట్ చేశారు. మధ్య మధ్యలో ప్రణీత సుభాష్ తన ఓల్డ్ వీడియోలు, ఫొటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.
సముద్ర తీరంలో నుంచి బికినీలో ఒడ్డుకు వస్తున్న వీడియో పోస్ట్ చేసి.. టేక్ మీ బ్యాక్ అంటూ క్యాప్షన్ జత చేసింది. మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ఈ ఓల్డ్ వీడియో పోస్ట్ చేసి ఉండచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రణీత పోస్ట్ చేసిన ఆ బికినీ వీడియో చూసిన ఫ్యాన్స్ ఎంతో అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రణీత ఓల్డ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.