Pranitha Subhash: కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడం ఒకటే అంటూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గో హత్యలు చేసే వారిని కాశ్మీరీ పండిట్లతో పోల్చటం ఏంటంటూ ఓ వర్గం సాయి పల్లవిపై మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి కామెంట్లపై హీరోయిన్ ప్రణీత సుభాష్ స్పందించారు. ఇన్‌డైరెక్ట్‌గా సాయి పల్లవికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గురువారం తన ట్విటర్ ఖాతా వేధికగా ఓ పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌లో.. ‘‘కాశ్మీరీ ఇస్లామిస్ట్ మిలిటెన్సీని చిన్న సమస్యగా భావిస్తున్నట్లయితే.. కాశ్మీరీ పండిట్ల దుస్థితిని సాధారణ సమస్యగా అనుకుంటున్నట్లయితే.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను మళ్లీ చూడండి… చూడు, అర్థం చేసుకో.. బాధితుల ఆర్థనాథాలను విను, సాను భూతి చూపించు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్టులో సాయి పల్లవి పేరు వాడకపోయినా.. ఇది సాయి పల్లవి ఉద్ధేశించి మాట్లాడినట్లే స్పష్టం అవుతోంది.
ప్రణీత పోస్టుపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి మంచి రిప్లై ఇచ్చారు అంటున్నారు. మరికొందరు సాయి పల్లవి పేరును ట్యాగ్ చేసుంటే బాగుండేదని అంటున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సాయిపల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి ఆమె మైండ్ పాడైందని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని..
ఆమెకు వాస్తవాలు మాట్లాడే ధైర్యం లేదన్నారు. కశ్మీర్ గురించి అక్కడి పండితులను కలిస్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు తిరగబడి కొడతారని రాజాసింగ్ హెచ్చరించారు. కాగా, వెండితెర బల్లాల దేవుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ వస్తోంది. మరి, సాయి పల్లవికి, ప్రణీత ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Trivialising the Kashmiri Islamist militancy & normalising the plight of the Kashmiri Pandits is a good enough reason for anyone to re-watch The Kashmir Files.
See, understand, hear the cries of the victims.
Empathise
— Pranitha Subhash (@pranitasubhash) June 16, 2022
ఇవి కూడా చదవండి : Madhu Shalini: మధుశాలిని వివాహం చేసుకున్న వ్యక్తి గురించి మీకు ఈ విషయాలు తెలుసా!