సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై నటించిన ప్రకాశ్ రాజ్ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో ‘డ్యూయెట్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఇద్దరు’ చిత్రం ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రకాశ్రాజ్. ఆ మధ్య ‘మా’ ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి.. ఒక రకంగా చెప్పాలంటే మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ఇటీవల ప్రకాశ్ రాజ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన సినీ నటులపై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆ మద్య కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలపై తనదైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ప్రభావమే ఆయన సినీ కెరీర్ పై పడి ఉండొచ్చని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా సినీ కెరీర్ పై రాజకీయ ప్రభావం బాగానే పడిందని బావిస్తున్నా.. ఒకప్పుడు నాతో కలిసి నటించేందుకు ఎంతో ఇష్టపడినవారు.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు… ఆసక్తి చూపించడం లేదు. బహుషా నాతో కలిసి నటిస్తే వారికి అవకాశాలు రావేమో అని భయం పట్టుకున్నట్టుంది.. అలాంటి వారిని కోల్పోవడానికి నేను ఎప్పుడూ సిద్దమే..’ అని అన్నారు.
ఈ విషయంలో నేను ఏమాత్రం బాధపడటడం లేదు.. ప్రస్తుతం నా నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. ఇటీవల జరుగుతున్న పరిణామాలు నన్ను మరింత స్వేచ్చాజీవుడిని చేశాయి. నేను నా స్వరం వినిపించకుంటే.. కేవలం ఒక మంచి నటుడిగానే చనిపోతాను’ అంటూ తన ఆవేదన ను ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ నటించిన పొన్నియన్ సెల్వన్, తిరు చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.