సినిమా రంగంలో రాణించి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు. పోనీ.. అవకాశం వచ్చినా.. ఆ పాత్రలో అయినా జీవించాలని అనుకుంటారు. అది అనుకున్నంత ఈజీ కాదు. అలా.. ఏ పాత్ర అయినా చేయగలిగేవారినే విలక్షణ నటుడు అంటారు. అలా విలక్షణ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడే.. ప్రకాష్ రాజ్. ఎమోషనల్..కామెడీ….విలనిజం ఇలా ఏ పాత్రలో అయినా ప్రకాష్ రాజ్ జీవించేస్తారు. తన నటనతో అబ్బురపరుస్తుంటారు. అలా ఇప్పటి వరకూ ఎన్నో అధ్బుతమైన సినిమాలలో ప్రకాష్ రాజ్ నటించారు. తాజాగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించారు.
అయితే.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించినప్పటికీ.. ఒకానొక సమయంలో కేజీఎఫ్ 2 తనను తీసేయాలని చూశారని చెప్పుకొచ్చారు. దానికి గల కారణాన్ని కూడా అయన వివరించారు. కేజీఎఫ్ నిర్మాతల్లో ఒకరు.. కర్ణాటక డిప్యూటీ సీఎం బ్రదర్ అని.. బీజేపీ కి సంబంధించిన వారు.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ను ఎందుకు తీసుకున్నారని అడిగారని చెప్పుకొచ్చారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ఎన్నో వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్. అలాంటి వివాదాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ఒకసారి మీరు కూడా చూసి ప్రకాష్ రాజ్ పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 19 ఏళ్ళ కుర్రాడిని KGF డైరెక్టర్ నమ్మడానికి కారణం ఏమిటంటే?