మా అధ్యక్ష ఎన్నికలకు గత కొద్ది రోజులుగా రగడ రాజుకుంటూనే ఉంది. ప్రకటన రాకముందే ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు వంటి వారు ఈ సారి అధ్యక్ష బరిలో నిలవనున్నట్లు ఎవరికివారు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌కు ప్రకటించి కాస్త దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే లోకల్, నాన్‌లోకల్ అనే అంశం తెర మీదకు వచ్చింది. దీనిపై పరోక్షంగా విమర్శలు సైతం చేసుకున్నారు.
ఈ తరుణంలోనే ఈ సారి ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగానే ఎన్నుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై తెర వెనుక సినీ పెద్దలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ ఇటీవల మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే మా ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఇక సాయం చేసిన వాళ్లే ఇలా చేస్తున్నారని, వారిపై భవిష్యత్‌లో అరెస్ట్‌లు కూడా జరగొచ్చిన తెలిపారు. ఈ మధ్యనే ప్రస్తుత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపింది.
ఇంకో పక్క మా ఎన్నికలు నిర్వహణను వాయిదా వేయాలని లోలోపల చర్చలు కూడా జరుగుతున్నాయట. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో స్పందించారు. తెగేదాక లాక్కండి అంటూ..ఓ కామెంట్‌ను పెట్టారు. ఇక ఇది పక్కా మా ఎన్నికలపైనే అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సారి ఎన్నికలను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారా..? లేక ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది.
తెగేదాకా లాక్కండి….#Justasking
— Prakash Raj (@prakashraaj) August 4, 2021