విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే.. పరకాయ ప్రవేశం చేసి దానికి న్యాయం చేస్తారు ప్రకాశ్ రాజ్. నటుడిగానే కాక సామాజిక కార్యకర్తగా కూడా పలువురికి సాయం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తారు ప్రకాశ్ రాజ్. అయితే ఆయన జీవితం మాత్రం పూలబాట కాదు. బాల్యం నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ప్రకాశ్ రాజు. తాజాగా ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానిలో తన జీవితంలో చోటు చేసుకున్న విషాద సంఘటనను తలుచుకుని.. భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రకాష్ రాజ్ అసంతృప్తి! గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘నా మొదటి భార్య లలిత కుమారితో విభేదాలు రావడంతో విడిపోదామనుకుని నిర్ణయించుకున్నాం. దీని గురించి ఇద్దరం బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాకే విడాకులు తీసుకున్నాం. అయితే ఆ తరువాత ఒంటరిగా ఉండాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇదే విషయాన్ని నా తల్లికి, ఇద్దరు కూతుళ్ళకి చెప్పాను. వారు కూడా ఓకే అన్నారు. అప్పుడే పోనీ వర్మను కలిశాను. ఆమె నాకన్నా చాలా చిన్నది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దాంతో మీ అందరూ నా ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వారిని ఒప్పించాను. అలా మా పెళ్లి జరిగింది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్ పుట్టిన రోజున కీలక ప్రకటన.. పునీత్ తర్వాత ఆ బాధ్యత నాదే!
‘‘ఇక వివాహం తర్వాత మా సంతోషానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఎంతో ఆనందించాం.. అయితే అనుకోని రీతిలో తనకి ఐదేళ్ల వయసున్నప్పుడు రిసార్ట్‌లో గాలిపటం ఎగరేస్తూ కిందపడ్డాడు. తలకు గట్టిగా దెబ్బ తగిలింది. ఎంత ప్రయత్నించినా బాబును కాపాడలేకపోయాను. ఆ సమయంలో నాకు ఈ ప్రపంచం వద్దనిపించింది.. కొడుకును కాపాడుకోలేని నాకు.. బతకడం వేస్ట్ అనిపించింది.. చచ్చిపోదామనుకున్నా.. కానీ నా చుట్టూ ఉన్నవారి కోసం బతకాలనుకున్నా.. ఇంకో పదిమందిని బతికించాలనుకున్నా.. ఆ తరువాత నాకు మరో బాబు పుట్టాడు. ప్రస్తుతం వాడే నాకు అన్నీ.. ” అంటూ ప్రకాశ రాజ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దళిత యువతి జీవితంలో వెలుగులు నింపిన ప్రకాష్ రాజ్