తండ్రి వారసత్వాన్ని తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రభుదేవా.. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ సినిమాలకు పని చేశారు. అయితే భార్యతో విడాకులు, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం అతడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే..
ప్రభుదేవా. డ్యాన్సింగ్ సంచలనం. భారతీయ మైకేల్ జాక్సన్. ఆయన డ్యాన్సుకు ఫిదా అవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. తండ్రి వారసత్వాన్ని తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రభుదేవా.. కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ సినిమాలకు పని చేశారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్ల పాన్పే. భార్యతో గొడవలు, కుమారుడిని కోల్పోవడంతో పాటు హీరోయిన్‌తో రాసలీలలు ఆయన జీవితాన్ని కుదిపేశాయి. అయితే అనూహ్యంగా మరో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సుందరం మాస్టర్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభుదేవా. మొదట కొరియోగ్రాఫర్‌గా పలు సినిమాలు చేశాడు. ఆ తర్వాత హీరోగా మారారు. పలు హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆ సమయంలో రమాలత్ అనే ఆమెతో వివాహం జరిగింది . వీరికి ముగ్గురు పిల్లలు కాగా, కుమారుడు విశాల్ 13 ఏళ్ల వయస్సులో ప్రాణాంతక వ్యాధితో మరణించారు. తరువాత దర్శకుడిగా, నృత దర్శకుడిగా బిజీ అవుతున్న సమయంలో ప్రముఖనటి నయనతారతో ప్రేమలో పడ్డాడు. వీరు వివాహం చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో మొదటి భార్య రమా వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టింది. అయితే 2011లో విడాకులు తీసుకున్నారు. కాగా, పెళ్లి చేసుకుంటారని భావించిన నయనతార, ప్రభుదేవా అనూహ్యంగా విడిపోయారు.
2020లో ప్రభుదేవా ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానిని వివాహం చేసుకున్నారని వార్తలు రాగా, అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలో వీరు ప్రేమలో పడ్డారని రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన సోదరుడు రాజు సుందరం ధృవీకరించగా.. తమ మధ్య సంబంధాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. కాగా, ఇప్పటి వరకు ఈ జంట బహిరంగంగా కనిపించిందీ లేదు. అయితే తాజాగా ఆయన 50వ పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా అతడికి విషెస్ చేస్తూ ఆమె తొలిసారిగా మీడియా కంటికి కనిపించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. ‘మీతో మూడేళ్ల ప్రయాణం..అద్భుతమైన జర్నీ. మీరు ఎంతో జాయ్ ఫుల్ పర్సన్.నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.