కొందరు హీరోలు సినిమా అంటే ప్రాణం పెట్టి నటిస్తారు. సినిమాలో ఓ పాత్ర పడితే బాగుటుందనిపిస్తే దాని కోసం ఎంత త్యాగానికైన సిద్దం పడుతుంటారు. అలాంటి వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ , హీరో దర్శకుడు ప్రభుదేవా ఒకరు. ఆయన పాత్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తాజాగా కేవలం ఐదు సెకన్ల సన్నివేశం కోసం ఏకంగా ఆయన గుండు గీయించుకున్నారు. మరి… ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ తమిళ దర్శకుడు రాఘవన్ దర్శకత్వంలో, డి.ఇమ్మాన్ సంగీత సారధ్యంలో ప్రభుదేవా నటించిన చిత్రం “మై డియర్ భూతం”. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ పిళ్లై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిన్నారులను ఆలరించేలా ఈ సినిమా రూపొందించారు. అయితే, కొన్ని సెకన్ల సన్నివేశం కోసం మీసాలు తీయడం, గుండు చేయించుకోవడంపై ప్రభుదేవా ఓ ట్వీట్ చేశారు. “చాలా ఏళ్లుగా ఏదో ఒక కారణం చెబుతూ మీసాలు, గెడ్డం ఉంచుకున్నాను. ‘మై డియర్ భూతం’ సినిమాలో ఓ సీన్ కోసం గుండు చేయించుకోవాలని దర్శకుడు కోరడంతో మొదట నిరాకరించాను. కానీ, అలా చేస్తేనే చిన్నారులు ఎంతగానో ఆనందిస్తారని దర్శకుడు వివరించడంతో అందుకు అంగీకరించాను” అని ప్రభు దేవా వివరించారు.
ఇక సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో రమ్యా నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. తమిళ్ బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ప్రభుదేవా ఒకవైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరొకవైపు తన కొరియోగ్రఫీని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా హిందీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లోనే మంచి ఆఫర్స్ పట్టేస్తున్నారు. బాలీవుడ్ మేకర్స్, హీరోలు కూడా ఎక్కువగా ప్రభుదేవాతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను ప్రభుదేవా హిందీ హీరోలతో రీమేక్ చేస్తుండటం విశేషం. మరి. ఐదు సెకన్ల సీన్ కోసం ప్రభు దేవా గుండు చేయించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
July 15 th pic.twitter.com/Ha4bsgnGJT
— Prabhudheva (@PDdancing) July 7, 2022