ప్రస్తుతం సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు మాత్రమే కాక.. స్టార్ కిడ్స్ ఫొటోలు కూడా తెగ వైరలవుతున్నాయి. ఇక తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి ఇంతకు ఆ కుర్రాడు ఎవరు అంటే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ పిక్, రేర్ ఫొటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని చూసినప్పుడు.. మన అభిమాన తారలు బాల్యంలో ఎలా ఉన్నారో.. ఎంత ముద్దుగా ఉన్నారో అనుకుంటాం. ఇక చాలా మంది స్టార్లను.. వారి బాల్యంలో ఎలా ఉన్నారో మనం గుర్తు పట్టడం చాలా కష్టం. కొందరిని మాత్రం వెంటనే గుర్తు పట్టవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలే తెగ వైరలవుతున్నాయి. దాంతో సెలబ్రిటీలు సైతం తమ చైల్డ్‌హుడ్ ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారు.. అరే ఈ కుర్రాడు చాలా ముద్దుగా ఉన్నాడే.. ఇంతకు ఈ కుర్రాడు ఎవరు.. ఏ సెలబ్రిటీ కొడుకు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకు ఆ కుర్రాడు ఎవరో మీరు గుర్తు పట్టారా.. లేదా.. అయితే చదవండి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా.. స్టేడియాలకు వెళ్లి.. అభిమానులతో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా.. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఆ సమయంలో ఆయన పక్కన ఓ కుర్రాడు కూడా ఉన్నాడు. దాంతో అందరి దృష్టి ప్రభుదేవ పక్కన ఉన్న కుర్రాడి మీదనే ఉంది. ఎవరీ కుర్రాడు.. ఎవరైనా అభిమానా అంటూ ఆ అబ్బాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతకు ప్రభుదేవా పక్కన ఉన్న ఆ కుర్రాడిని మీరు గుర్తు పట్టారా.. లేదా.. అయితే మేమే చెప్తాం వినండి.. చదవండి. ఆ కుర్రాడు మరేవరో కాదు.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనిపించుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కుమారుడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడటం కోసం కుమారుడితో కలిసి వచ్చాడు ప్రభుదేవా. లక్నో సూపర్‌జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్న రోజున ప్రభుదేవా.. మ్యాచ్ చూసేందుకు తన కొడుకుతో కలిసి స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోని తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు ప్రభుదేవా. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రభుదేవా అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఆయన డ్యాన్స్. డిఫరెంట్ స్టైల్‌తో, స్టెప్స్ డిజైన్ చేయడంతో ప్రభుదేవా దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కేవలం కొరియోగ్రాఫర్ మాత్రమే కాక.. దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నాడు. తమిళంలో పోక్కిరి, విల్లు, ఎంగేయుమ్ కాదల్, వేది చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో వాంటెడ్, రౌడీ రాథోడ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
ఇక ప్రభుదేవాకు మొదట రామలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత ప్రభుదేవా నయనతారను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకపోవడం వల్ల నయనతార-ప్రభుదేవా పెళ్లికి ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత నయన్, ప్రభుదేవా ఇద్దరు విడిపోయారు. ఇక మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 9ఏళ్ల తర్వాత ప్రభుదేవా లాక్‌డౌన్ కాలంలో సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. తనకు సేవలు చేసిన ఓ ఫిజియో థెరపిస్టును ప్రభుదేవా పెళ్లాడారు.
IPL pic.twitter.com/kvjdcS0PoE
— Prabhudheva (@PDdancing) April 11, 2023