మంచు విష్టు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరావు’. అవ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్టు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ క్రమంలో చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అది అలాంటిలాంటి అప్డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభు దేవ ఈ చిత్రంలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం.
ప్రభు దేవా డ్యాన్స్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గర స్టెప్పులు నేర్చుకోనీ నటులూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన డ్యాన్స్ తో ట్రెండ్ సృష్టించిన ప్రభుదేవా చాలా కాలం నుంచి టాలీవుడ్ కి కరువయ్యాడు. దర్శకుడిగా మారి బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యారు. డ్యాన్స్ కొరియోగ్రఫీకి కాస్త దూరంగా ఉన్నారు. అయితే చాలా కాలం తరువాత ఆ లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. మంచు విష్ణు నటిస్తున్న ‘గాలి నాగేశ్వరావు’ చిత్రంలోని ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హుషారైన గీతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో విష్టు, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై ఈ పాట తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోని ఓ పాటకు కూడా ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయనున్నారు. చాలా కాలం తర్వాత ప్రభుదేవా ఈ “గాలి నాగేశ్వరావు” చిత్రంతో తిరిగి టాలీవుడ్ కి వచ్చాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prabhu Deva to compose a dance number for Manchu Vishnu’s next https://t.co/OmJc4Y56RL pic.twitter.com/5KrtLsFd6n
— Tollywood Reporter (@TeluguReporter) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.