చిత్రపరిశ్రమల్లో ప్రభుదేవా పేరు తెలియని వారుండరనేది కాదనలేని వాస్తవం. ఇండియా మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా డ్యాన్సర్, నటుడు, దర్శకుడు వంటి మల్టీటాలెంటెతో అందరిని మెప్పిస్తున్న ఈయన ఓ సంచనల నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో డ్యాన్సర్ గా మారి ఆ తర్వాత నటుడు దాని తర్వాత దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు ప్రభుదేవా. ఇక తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు.
అయితే ఈ సినిమాల తర్వాత తెలుగు సినిమాల పెద్దగా కనిపించని ప్రభుదేవా హింది సినిమాల్లో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుదేవా ఇక దర్వకత్వ బాధ్యతలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా నటించేందుకు అవకాశాలు వస్తున్న నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించేందుకు ఆలోచనలు లేవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రభుదేవా ఇక నుంచి సినిమాలు తెరకెక్కించారా అనే ప్రశ్నకు కాలామే సమాధానం చెబుతోంది.