నిన్న మొన్నటి వరకు ఆయన రెబల్ స్టార్ మాత్రమే. కానీ.., ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. ఇది ప్రభాస్ రేంజ్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా కనీసం డేట్స్ అడగడానికి దైర్యం చేయలేని స్థాయికి వెళ్ళిపోయాడు ప్రభాస్. ఇదంతా బాహుబలి పుణ్యమే అయినా.., ఆ తరువాత కూడా ప్రభాస్ మ్యానియా పాన్ ఇండియా వైడ్ అలానే కొనసాగుతోంది.
బాహుబలి తరువాత ప్రభాస్ ఎవరితో సినిమా చేయబతున్నాడు అని అంతా ఎదురుచూడగా అందరికీ షాక్ ఇస్తూ.. కొత్త కుర్రాడు సుజిత్ కి ఛాన్స్ ఇచ్చాడు. వీరి కాంబో లో వచ్చిన ‘సాహో’ టాలీవుడ్ లో నిరాశ పరిచినప్పటికీ, బాలీవుడ్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక మేకింగ్ పరంగా కూడా ‘సాహో’ సూపర్ అనిపించుకుంది. ఈ కారణంగానే ఇప్పుడు ప్రభాస్ మరోసారి సుజిత్ కి అవకాశం ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
సుజిత ‘సాహో’ తరువాత ఏ మూవీకి కమిట్ కాలేదు. ఈ గ్యాప్ లోనే యంగ్ డైరెక్టర్ ప్రభాస్ కోసం ఓ యూనివర్సల్ కాపీ స్టోరీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుజిత్ దీనికి సంబంధించిన లైన్ ని కూడా ప్రభాస్ కి నేరేట్ చేశాడట. లైన్ విన్న ప్రభాస్ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. సో.. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే సుజిత్ కన్నా లక్కీ డైరెక్టర్ ఎవరు ఉండరని చెప్పుకోవాలి. మరి… ప్రభాస్ మరోసారి సుజిత్ కి అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.