పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్-K వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు, డైరెక్టర్ మారుతీతో ఫుల్ లవ్ ట్రాక్ మూవీలతో హడావుడిగా గడుపుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ సినిమాలో ప్రభాసే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో. రాధే శ్యామ్ వరకు సినిమాకి రూ.100 కోట్లు తీసుకున్నాడు.
రాధే శ్యామ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే విషయం తెలిసిందే. కానీ, ప్రభాస్ మాత్రం తన రెమ్యూనరేషన్ మరో రూ.20 కోట్లు పెంచేసినట్లు తెలుస్తోంది. అయితే అది నిర్మాతలకు ఏ మాత్రం కష్టంగా అనిపించదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ సినిమాకి ఓ మాదిరి హిట్ టాక్ వస్తేనే.. ఈజీగా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది. అందుకే ప్రొడ్యూసర్లు కూడా రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోవడం లేదంట.
ఇంకొక విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రాజెక్టుల ద్వారా ప్రభాస్ కు దాదారు రూ.500 నుంచి 600 కోట్లు రాబోతున్నాయి. అయితే ఈ డబ్బంతా ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నని కూడా కొందరు లేవనెత్తుతున్నారు. అయితే ప్రభాస్ ఆ డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. హోటల్ చైన్ మార్కెట్ లోకి ప్రభాస్ అడుగుపెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
అయితే ప్రభాస్ హోటల్ చైన్ బిజినెస్ ని ఇండియాలో ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. దుబాయ్, స్పెయిన్ దేశాల్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ బిజినెస్ ప్లానింగ్ విషయంలోనే ప్రభాస్ కాస్త బిజీగా ఉన్నాడంట. ప్రభాస్ రెమ్యూనరేషన్, బిజినెస్ ప్లానింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.