డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ పాన్ ఇండియా లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్‘. భారీ అంచనాల నడుమ మార్చి 11న రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుతుంది. ఈ క్రమంలో ప్రధాన నగరాలలో రాధేశ్యామ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజాగా రాధేశ్యామ్ బృందం చెన్నైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రభాస్, పూజాహెగ్డే, దర్శకుడు రాధాకృష్ణతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మధ్యలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. సదరు రిపోర్టర్.. “సర్ మీ సినిమాలో లవ్, డెస్టినీల క్లాష్ లో ఏది గెలుస్తుంది?” అని అడిగాడు.దానికి స్పందించిన ప్రభాస్.. ‘సర్ ఒక 50 రూపాయలైనా పెట్టి టికెట్ కొని సినిమా చూడండి.. మా ప్రొడ్యూసర్ 300కోట్లు ఖర్చుపెట్టి తీశారు” అంటూ నవ్వుతూనే కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రాధేశ్యామ్ మూవీ ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో అంచనాలు రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.