యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకి ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, సాహో వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీపై చాలానే అంచనాలు నెలకొన్నాయి. మార్చి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వస్తుండటంతో.. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ చేసింది. ఇందుకోసం రాధేశ్యామ్ టీమ్ ఒక్కోరోజు.. ఒక్కో స్టేట్ లో ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తోంది. అయితే.. మాటల విషయంలో పొదుపు పాటించే ప్రభాస్.. ఈ ప్రెస్ మీట్స్ లో మాత్రం యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాను చెప్పాలి అనుకుంటున్న విషయాలను మొహమాటం లేకుండా చెబుతూ.. రాధేశ్యామ్ కు రీచ్ పెంచే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ లిప్ లాక్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
“నాకు రొమాంటిక్ సీన్స్ లో నటించాలంటే ఈరోజుకి కాస్త సిగ్గుగా ఉంటుంది. యాక్షన్ మూవీస్ లో అయితే.. ఈ లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ కట్ చేసుకోవచ్చు. కానీ.. రాధేశ్యామ్ కంప్లీట్ లవ్ స్టోరీ. కాబట్టి.. ఆ సీన్స్ లో నటించక తప్పలేదు. పూజాతో చేసిన ఆ లిప్ లాక్ సీన్ బాగా ఇబ్బంది పెట్టింది. ఇక కొన్ని సన్నివేశాల్లో షర్ట్ లేకుండా నటించాల్సి వచ్చింది. సెట్ లో చాలామంది చూస్తుండగా.. అలా నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డాను” అంటూ.. ప్రభాస్ తన బాధలను సరదాగా చెప్పుకొచ్చాడు.
నిజానికి ప్రభాస్ కి కాస్త సిగ్గు ఎక్కువ. ఈ కారణంగానే ఆయన ఎక్కువగా ఇండోర్ షూట్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ.. డార్లింగ్ ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉంటాను అంటే కుదరదు. ఎందుకంటే.. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన నుండి అభిమానులు చాలా ఎలిమెంట్స్ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరిని తృప్తి పరచాలంటే.. ఇలాంటివి చేయక తప్పదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.