ప్రభాస్ 'సలార్' ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ఓవర్సీస్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో పెద్దలతో పాటు ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు.
డార్లింగ్ ప్రభాస్.. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. తన కొత్త సినిమాలతో సరికొత్త ఘనతల్ని సాధిస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘ఆదిపురుష్’.. జూన్ 16న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత దసరాకు అంటే సెప్టెంబరు 28న ‘సలార్’.. వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు అవి కాదన్నట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనూ ‘సలార్’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఇది కాస్త డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. దాదాపు ఏడాదిన్నర క్రితమే షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈసారి మాత్రం రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న వాటిలో భారీ అంచనాలు.. ఈ మూవీపైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘సలార్’ ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్సీస్ హక్కులు రూ.67 కోట్లకు అమ్ముడుపోగా.. ‘సలార్’ దాన్ని బ్రేక్ చేసినట్లు సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ‘సలార్’ ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ.70 కోట్లకు అమ్ముడయ్యావని అంటున్నారు. అలానే వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ‘ప్రాజెక్ట్ K’ఓవర్సీస్ రైట్స్ అయితే రూ.80 కోట్ల వరకు పలుకుతున్నాయని సమాచారం. సలార్ డీల్ జరిగిపోయింది గానీ ‘ప్రాజెక్ట్ K’మాత్రం ఇంకా సెట్ అవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ‘సలార్’లో ప్రభాస్ తోపాటు శ్రుతిహాసన్, జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ దాదాపు రూ.400 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.1000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. సరే ఇదంతా పక్కనబెడితే సలార్ ఓవర్సీస్ రైట్స్ డీల్ గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Buzz : #Salaar Overseas Rights quoted for a whopping price of 70cr… #Prabhas #SalaarThrSaga 💥💥💥 pic.twitter.com/PtmNU1qgiW
— Prabhas ❤ (@ivdsai) April 1, 2023