డార్లింగ్ ఫ్యాన్స్ కోసం 'సలార్' అప్డేట్ తో వచ్చేసింది హీరోయిన్ శ్రుతిహాసన్. అందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రభాస్ సినిమాల్లో ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్న మూవీ ‘సలార్’. డార్లింగ్ కటౌట్ తగ్గ యాక్షన్ మూవీ, దానికి ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్.. ఈ మూవీకి డైరెక్టర్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే అప్పుడెప్పుడో మొదలుపెట్టారు కానీ అప్పటినుంచి ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 28న రిలీజ్ ఉంటుందని గతేడాదే ప్రకటించారు. విడుదల తేదీ అయితే చెప్పారు కానీ ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. చిన్న విషయం బయటకొచ్చినా సరే ఆసక్తితో చూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రుతిహాసన్ ఓ అప్డేట్ చెప్పుకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డార్లింగ్ ప్రభాస్ అంటే సినిమా స్టోరీ ఎంత ముఖ్యమో హీరోయిన్ ఎవరనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆ కటౌట్ కి సరిపోవాలి కదా. అలా ‘సలార్’లో శ్రుతిహాసన్ హీరోయిన్ అనేసరికి రిలాక్స్ అయిపోయారు. అయితే ఇందులో ఆద్య అనే రిపోర్టర్ గా శ్రుతిహాసన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే.. ప్రభాస్-శ్రుతి మధ్య సాంగ్స్ ఏం ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ విషయాన్నే చెబుతూ ఇన్ స్టాలో తాజాగా పోస్ట్ పెట్టింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తోపాటు మూవీ టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘సలార్’ గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్నాళ్ల ముందు.. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రెండు పార్టులుగా తీస్తున్నారని అన్నారు. మొన్నీమధ్య వచ్చిన టాక్ ప్రకారం.. రెండు భాగాలు కాదు ప్రభాస్ కు టైం లేకపోవడం వల్ల ఒక్క పార్ట్ తోనే తేల్చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. మీలో ఎంతమంది ప్రభాస్ ‘సలార్’ కోసం వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.