డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్. అవును 'ప్రాజెక్ట్ k' కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ పెద్ద ప్లానే వేస్తున్నాడట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ హీరో నుంచి సరైన సినిమా ఒక్కటి పడలేదు. రెండు మూవీస్ ప్రేక్షకులు ముందుకొచ్చాయి కానీ కటౌట్ తగ్గ హిట్ అయితే కొట్టలేకపోయాయి. బాక్సాఫీస్ ని షేక్ చేయడానికా అన్నట్లు ప్రస్తుతం మూడు చిత్రాలు రెడీ అవుతున్నాయి. వాటిలో ‘ఆదిపురుష్’, ‘సలార్’.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుండగా.. ‘ప్రాజెక్ట్ K’ మాత్రం వచ్చే సంక్రాంతికి అందరినీ పలకరించనుంది. ఇప్పుడు ఈ సినిమాపై క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసి అభిమానుల తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, దాన్ని కంటిన్యూ చేసేలా భారీ బడ్జెట్ సినిమాలు చాలానే ఒప్పుకొన్నాడు. వాటిలో ‘సాహో’ యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా, ‘రాధేశ్యామ్’ ప్యూర్ లవ్ స్టోరీ. కారణం ఏంటో తెలీదు గానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజులో సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే 8 నెలల్లో దాదాపు మూడు కొత్త చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. వాటిలో ‘ఆదిపురుష్’పై పెద్దగా అంచనాల్లేవు గానీ ‘సలార్’పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ K’ గురించి చాలా తక్కువగానే మాట్లాడుకుంటున్నారు.
‘మహానటి’ లాంటి వండర్ ఫుల్ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ తీస్తున్న సినిమా కాబట్టి.. సెట్ ఆఫ్ ఆడియెన్స్ అయితే ‘ప్రాజెక్ట్ K’ కోసం చాలానే వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. టైటిల్ లో ఉన్న K అంటే కృష్ణ లేదా కర్ణ అని అర్థమట. అలానే ఏకంగా ఎనిమిది భాగాల సిరీస్ గా దీన్ని తీసే ప్లాన్ లో ఉన్నారట. తొలి రెండు పార్ట్స్ లో ప్రభాస్ ఉంటాడని, మిగిలిన వాటిలో వేరే హీరోలు నటిస్తారని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మరి ఈ న్యూస్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023