డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో తన సత్తా ఏంటో చూపించాడు సందీప్. అదీగాక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే క్రైమ్ డ్రామా రూపొందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా అనంతరం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే సందీప్ – ప్రభాస్ కాంబినేషన్ పై భారీ ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్న అభిమానులకు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్, టి-సిరీస్ భూషణ్ కుమార్ ఓ తీపికబురు చెప్పాడు. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో డార్లింగ్ పాత్ర ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు.. ప్రభాస్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్(COP) పాత్రలో కనిపిస్తాడని.. సందీప్ ఈ సినిమాని కాప్-డ్రామా నేపథ్యంలో ప్లాన్ చేసినట్లు తెలిపాడు. ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేయనున్న సంగతి తెలిసేసరికి ఫ్యాన్స్ లో మాములు ఖుషి కాదు.ఈ స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K సినిమాల తర్వాతే పట్టాలెక్కనుందని నిర్మాత భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజుకి సిద్ధంగా ఉంది. అయితే.. ప్రభాస్ కెరీర్ లో 25వ సినిమాగా స్పిరిట్ రాబోతుండటం విశేషం. మరి డార్లింగ్ పాన్ ఇండియా మూవీ లైనప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.