ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్‌కున్న పాజిటివ్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్‌గా ఎదిగాడు. ఆయనతో పని చేసిన వారు ప్రభాస్ గురించి చాల గొప్పగా చెప్తారు. ఇక తనతో పని చేసే కోస్టార్స్‌ని ప్రభాస్ ఎంత బాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి కోసం తన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తాడు. అంత స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టే.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు అందరూ ప్రభాస్‌ని ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో మరోసారి తన స్టైల్‌లో భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు డార్లింగ్. తనకు నచ్చిన వ్యక్తి బర్త్‌డే కోసం ఏకంగా ఆరడుగుల కేక్‌ని రెడీ చేపించాడు. ఈ విషయం తెలిసిన వారంతా.. వావ్.. ఆరడుగుల కేకా.. ఎవరి కోసం అబ్బ అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మరి ఇంత భారీ కేక్ ఎవరి కోసం అంటే..
ప్రభాస్ ఓ డైరక్టర్ బర్త్ డే సందర్భంగా 6 ఫీట్ కేక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడట. ఇంతకీ ప్రభాస్ సర్ ప్రైజ్ ఇచ్చిన డైరక్టర్ ఇంకెవరో కాదు… కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు జరిగిన సంగతి తెలిసింద. ఈ వేడుకలకు ప్రభాస్‌తో పాటు,. కన్నడ స్టార్ హీరో యష్ కూడా హాజరయ్యాడు. దీంతో ప్రశాంత్ నీల్‌కి బర్త్ డే గిఫ్ట్‌గా ఆరడుగుల కేక్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడట ప్రభాస్. హ్యాపీ బర్త్ డే ప్రశాంత్ నీల్ నీకు ఇంకా మరెన్నో సక్సెస్ లు రావాలని కోరుతున్నా అంటూ ఓ మెసేజ్ కూడా పంపించాడట ప్రభాస్.
ఇది కూడా చదవండి: Adipurush: అవతార్ టెక్నాలజీతో ప్రభాస్ ‘ఆదిపురుష్’.. హాలీవుడ్ ని మించబోతుందా..?
ఇక ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో ప్రభాస్.. సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైం లో ప్రశాంత్ నీల్‌తో మంచి సన్నిహిత్యం ఏర్పడిందని తెలుస్తుంది. కేజీఎఫ్ 1,2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా భారీ రేంజ్ హిట్ కొడుతుందని.. బాహుబలి రికార్డులను కూడా కొల్లగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి: Adivi Sesh: ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకున్నాకే నేను చేసుకుంటా: అడవి శేష్
ఇక సినిమాల విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో “సలార్” అలాగే ప్రాజెక్ట్ కే లాంటి రెండు భారీ చిత్రాల షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలు లైన్‌లో ఉండగా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు చేయడానికి డార్లింగ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇచ్చిన భారీ సర్‌ప్రైజ్ గురించి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cake Ordered By #Prabhas ❤️ pic.twitter.com/jsDifyvNM1
— Wizu! (@Zel_Tweets) June 4, 2022
ఇది కూడా చదవండి: Praseeda Uppalapati: ప్రభాస్ సోదరి ప్రసీదకు చేదు అనుభవం.. ట్విట్టర్ పోస్ట్ వైరల్!