హీరో ప్రభాస్ గురించి ఫ్యాన్స్ కి చాలావరకు తెలుసు. కానీ ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ని హీరోయిన్ అనుష్క తాజాగా రివీల్ చేసింది. ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే చాలామందికి అతడి పాన్ ఇండియా సినిమాలే గుర్తొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు మాత్రం స్వీటీ అనుష్క గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్లిద్దరి బాండింగ్ అలాంటిది. కలిసి చేసింది ఓ నాలుగు సినిమాలు. కానీ రూమర్స్ మాత్రం చాలా అంటే చాలానే వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని ప్రభాస్-అనుష్క క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. చాలారోజుల తర్వాత వీళ్ల జోడీ.. మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ ఇంట్రావర్ట్. పెద్దగా బయట కనిపించడు. పాన్ ఇండియా స్టార్ కావొచ్చు కానీ ఇప్పటికీ మాట్లాడాలంటే తెగ మొహమాటపడుతూ ఉంటాడు. ఇతడి గురించి ఫ్యాన్స్ చాలావరకు తెలుసు. కానీ ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ని ఇప్పుడు అనుష్క బయటపెట్టింది. అది కాస్త ఇప్పుడు అభిమానుల ఆనందానికి కారణమైంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రభాస్… పలు సినిమాలను ప్రమోట్ చేస్తుంటాడు. అలా అనుష్క లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ రిలీజ్ కాగా, దాన్ని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు.
ఇప్పుడు ప్రభాస్ స్టోరీని షేర్ చేసిన అనుష్క.. ‘పప్సు’ అని డార్లింగ్ నిక్ నేమ్ ని బయటపెట్టింది. ఓహో ప్రభాస్ ముద్దుపేరు ఇదా అని నెటిజన్స్, అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విషయానికొస్తే.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. చాలారోజుల తర్వాత అనుష్క స్క్రీన్ పై కనిపించింది. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం తెగ నచ్చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ప్రభాస్ నిక్ నేమ్ ని అనుష్క రివీల్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.