పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతు దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన రాదేశ్యామ్ మూవీ మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడిచింది. అయితే ప్రభాస్ సినిమాకు సంబంధించి ఓ తాజా అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: తమిళ సినిమా కన్నా.. తెలుగు సినిమా గ్రేట్: భారతీరాజా!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం DIY Arri Alexa అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారట. దీనివల్ల వీజువల్ ఎక్స్ పీరియన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే? ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా ఇదేనట. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ వంటి సినిమాలు కూడా చేస్తున్నాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.